Thursday, February 28, 2013

శతకాల పట్టిక 1

1 అభినవకుమతీ శతకము గాజులపల్లి వీరభద్రరావు కుమతీ
2 అభినవసుమతీ శతకము ధర్భా సుబ్రహ్మణ్యశర్మ సుమతీ
3 అచలగురుగీతా శతకము సరస్వతీ భోజరాజు అసిపదాంతర్య శేషాచలార్యవర్యా
4 ఆచంటరామేశ్వర శతకము  మేకా బాపన్న భూతలోకేశ ఆచంటపుర నివేశ భావ భవనాశ రమేశ పార్వతీశ
5 అచ్యుత శతకము తిరువెంగడ తాతదేశికాచార్యులు అచ్యుతా
6 ఆదినారాయణ శతకము అబ్బరాజు శేషాచలామాత్య ఆదినారాయణా
7 అగస్త్యలింగ శతకము తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు  ఈమనియగస్త్యలింగ బాలేందు సంగ
8 అఘవినాశ శతకము    దాసరి అంజదాసు అంజదాసపోష అఘవినాశ
9 ఆంధ్రానాయక శతకము కాసుల పురుషోత్తమ కవి చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హతవిమతజీవ శ్రీకాకుళాంధ్ర దేవా
10 ఆంధ్రసూర్య శతకం మయూర కవి (సంస్కృతం నుండి అనువాదం) సూర్యా
11 ఆంజనేయ శతకము పరాశరం నరసింహాచార్యులు ఆంజనేయప్రభో
12 ఆనందరామ శతకము ముత్తెనపెద్ది సత్యనారాయణ ఆనందరామా! ప్రభో
13 అనంత శతకము తిరువెంగడ తాతదేశికాచార్యులు అనంత
14 ఆరోగ్య వేంకటేశ్వర శతకము రామసుబ్బారాయడు వేంకటేశ్వరా
15 ఆర్తరక్షామణీ శతకము అనంతరామ పట్నాయక ఆర్తరక్షామణి
16 ఆత్మలింగ శతకము ఆకుల గురుమూర్తి అఖిలజీవసంగ ఆత్మలింగా
17 అవధూత నిర్మలానంద స్వామి శతకము అవధూత నిర్మలానందస్వామి నిజమనే యవధూత నిర్మలుండు
18 బాల శతకము కొణిదెన వేంకటనారాయణ బాల
19 బాల శతకము అలపాటి వేంకటప్పయ్య విమల వినుతశీల వినుర బాలా
20 బాలకృష్ణ శతకము జక్కేపల్లి జగ్గకవి కృష్ణా
21 బాలశశాంకమౌళి శతకము    కొమ్మోజు సోమనాధకవి బాలశశాంకమౌళి మనపాలగలండు విచారమేటికిన్
22 భారతీ శతకము    కఱ్ఱి సాంబమూర్తి  శాస్త్రి భారతీ   (వ్రాతపతి )
23 బర్హిశిలేశ్వర శతకము   నెమలికంటి  బాపయ్య భరభవ పాపనాశ వరబర్హి శిలేశ మహేశ యీశ్వరా
24 బెజవాడ కనకదుర్గాంబ శతకము  సరికొండ లక్ష్మీనృసింహ రాజు శరజన్మాంబ బెజవాడ కాళికాంబ మదంబా
25 భద్రాద్రి రామచంద్ర శతకము బళ్ళ రామచంద్రరాజ కవి రమ్యగుణసాంద్ర భద్రాద్రిరామచంద్ర
26 భద్రాద్రి సీతారామ శతకము   అబ్బరాజు పిచ్చయ్య శ్రీకర భద్రాద్రిధామ సీతారామా
27 భద్రగిరి శతకము భల్లా పేరయకవి భద్రగిరివాస శ్రీరామభద్ర దాసపోష బిరుదాంక రఘుకులాంబుధిశశాంక
28 భక్తజీవన శతకం వాసా కృష్ణమూర్తి భక్తజీవనా
29 భక్తకల్పద్రుమ  శతకము పంగులూరి ఆదిశేషయ్య భక్తకల్పద్రుమా
30 భక్తమందార శతకము కూచిమంచి జగ్గకవి రామా భక్తమందారమా
31 భక్తవత్సల శతకము పతీ సూర్యనారాయణమూర్తి భక్తవత్సలా
32 భక్తవత్సల శతకము గూటాల కామేశ్వరమ్మ భక్తవత్సలా
33 భరత శతకము టంగుటూరి వరదరాజశర్మ భరతా
34 భారతాంబికా శతకము గరికపాటి మల్లావధాని(?) భారతాంబికా
35 భాస్కర శతకము మారద వెంకయ్య భాస్కరా
36 భట్టి విక్రమార్కేశ్వర శతకము పెనుమత్స మహాదేవ కవి భట్టీశ్వరా, విక్రమార్కేశ్వరా
37 భీమేశ శతకము దేవరకొండ అనంతరావు భీమేశా
38 భుజగభూపాల శతకము క్రొత్తపల్లి సుందరరామకవి భోగదేవేంద్ర నిర్మలభుద్దిసాంద్ర పండిత కవీంద్ర భుజగభూపాలచంద్ర
39 బ్రహ్మానంద శతకము నిజానంద నరసింహస్వాములు బ్రహ్మానందా
40 బుద్ధ శతకము ఆచార్య బోధి భాస్కర బుద్ధుఁడా
41 చక్రధారి శతకము పింగళి వేంకటసుబ్రహ్మణ్య కవి చక్రధారీ శ్రితమనోబ్జ చయవిహారీ
42 చంద్రశేఖర శతకము   (రచయిత తెలియదు) చంద్రశేఖరా
43 చండి శతకము బాణ మహాకవి సంస్కృతం
44 చన్న మల్లేశ్వర శతకము గంగాధర కవి సర్వగుణధామ శ్రీశైలసార్వభౌమ చెన్నమల్లేశ శివలింగ శరణు శరణు
45 చన్నకేశవ శతకము నారాయణం రామానుజాచార్యులు సురుచిరవిలాస లశునాఖ్య పురనివాస చన్నకేశవదేవ విశాలభావ
46 చెన్నకేశవ శతకము గి.కృష్ణమూర్తి
47 చెన్నకేశవ శతకము రామ్మడుగు సీతారామ శాస్త్రి చెన్నకేశవా
48 చెన్నకేశవ స్వామి శతకము అడుగుల రమయాచారి చెన్నకేశవా, దైవపురీశ కేశవా
49 చిద్విలాస శతకము రప్తాడు సుబ్బదాస యోగి చిత్సుఖానంద సర్వేశ చిద్విలాసా
50 చిత్తోప రమణ శతకము వేంకట శోభనాద్రి కవి చిత్తమా
51 చౌడప్ప శతకము కవి చౌడప్ప కుందవరపు కవిచౌడప్పా
52 దాశరధీ శతకము కంచర్ల గోపకవి దాశరధీ కరుణాపయోనిధీ
53 దత్తమూర్తి శతకము వినుమల్లి సూరారెడ్డి ధాత్రి సత్కీర్తి కంతేటి దత్తమూర్తి
54 దయా శతకము ఎన్ యె నరసింహాచార్యులు (సంస్కృతం)
55 దేవకీనందన శతకము (రచయిత తెలియదు) కృష్ణా దేవకీనందనా
56 దీక్షిత శతకము వజ్ఝ సూర్యనారాయణ కవి రమ్యగుణధూర్య లక్ష్మీనారాయణార్య
57 దీనావన శతకము పామర్తి బుచ్చిరాజు దేవ దీనావనా
58 దృష్టాంత శతకము శ్రీకుసుమ దేవ (సంస్కృతం)
59 దుర్గ భర్గ శతకం కపిలవాయి లింగమూర్తి దుర్గ, భర్గ
60 దుర్గామల్లేశ్వర శతకము చల్లా పిచ్చయ్య దుర్గామల్లేశ్వరా సర్వదేవ పరివారా హారాహీరా కృతీ
61 ద్వారకాపతి శతకము ఆదిభట్ట శ్రీరామమూర్తి కవి ద్వారకాపతీ
62 ద్వారకవేంకటేశ్వర శతకము నరసింహకవి ద్వారకవేంకటేశ్వరా
63 ద్విప్రాస శ్రీముఖలింగ శతకము అమలాపురపు సన్యాసి కవి శ్రీముఖలింగా (వ్రాతప్రతి)
64 గాలిబ్ ప్రేమ శతకం బెజవాడ గోపాలరెడ్డి (అనువాదకుడు)
65 గాంధీ శతకము బైరెడ్డి-సుబ్రహ్మణ్యం గాంధీ
66 గాంధి శతకము చొల్లేటి నృసింహశర్మ మో.క.గాంధి మహాత్మా
67 గాంధీజీ శతకము దుగ్గిరాల రాఘవచంద్రయ్య గాంధీజీ
68 గాంధీనీతి శతకము దివల్లి సూరకవి వస్త్సా
69 గౌరీపతి శతకము మబగాపు కృష్ణ మూర్తి గౌరీపతీ
70 గోపకుమార శతకము ప్రహరాజు గంగరాజు గోపకుమారా
71 గోపాల శతకము సత్యవోలు సుబ్బారావు గోపాలా
72 గోవింద శతకము తిరువెంగడ తాతదేశికాచార్యులు గోవింద
73 గురు శతకము బంకుపల్లి రామజోగారావు గురూ
74 గురునాథేశ్వర శతకము దోమా వేంకటస్వామి గుప్త గురునాధేశ జగద్వల్లభా
75 గువ్వలచెన్న శతకము పట్టాభి రామకవి (?) గువ్వలచెన్నా
76 హైదరాబాదునగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము ఓగేటి అత్య్తరామశాస్త్రి బిర్లమందిరవాస శ్రీవేంకటేశ
77 హంసతారావలి సిరిపల్లె విశ్వనాధ శాస్త్రి మానసరాజహంస చనుమా వినువాకకుఁ బ్రొద్దుగుంకెడిన్ల
78 హంసయోగ శతకము వేంకట రామయోగి రమ్యతరభోగి వేకటరామయోగి
79 హర శతకము పెండ్యాల నారాయణ శర్మ హరా
80 హరి శతకము భమిడిమర్రి రామచంద్రమూర్తి శ్రీహరీ
81 హరి శతకము తూము సీతారామయ్య శ్రీహరీ
82 హరిహరనధ శతకము మహమ్మద్ హుస్సైన్ హరిహరనాథా
83 రిముకుంద శతకము కోట్రెడ్డి నాగిరెడ్డి భువిని పందులకుంట సత్పురనివాస అరసినన్నేలు గోవింద హరి ముకుంద
84 హిమగిరి శతకం త్యాగి హిమగిరిస్థలి మాహాత్మ్య మెన్నఁదరమే
85 ఇందిరా శతకము గోవర్దహ్న శ్రీరంగాచార్యులు ఇందిరా
86 ఈశ్వర శతకం అందె వేంకటరాజం ఈశ్వరా
87 జగదీశ శతకము సన్యాసి నారాయణ శ్రీజగదీశా
88 జమ్మలమడ్క శ్రీ ఆంజనేయ శతకము కన్నెకంటి వీరభద్రచార్యులు శ్రీజమ్మలమడ్క పూర్వర నివాస ఆంజనేయ ప్రభో
89 జానకీనాయక శతకము మాటూరు వేంకటేశం రామ జానకీనాయా
90 జానకీనాయక శతకము నరహరి గోపాలాచార్యులు జానకీనాయకా
91 జానకీపతి శతకము వాజిపేయుల రామసుబ్బారాయడు జానకీ పతీ
92 జానకీపతి శతకము (రచయిత తెలియదు) జానకీపతి
93 జానకీప్రియ శతకము     వేంకటాఖ్య కవి జానకీప్రియా
94 జానకిశ శతకము శంకర నారాయణ రాజు శరణుజొచ్చితి ననుబ్రోవు జానకీశా
95 జనార్ధన శతకము మంగు వేంకటరంగనాధరావు జనార్ధన
96 జీడికంటిరామ శతకము కేశవపట్నం నరసయ్య సిరులకిరువైనజుంటి శ్రీ జీడికంటిధామ సుగుణాభిరామ శ్రీరామరామ
97 జ్ఞానప్రసూనాంబిక శతకము    శిష్టు సర్వాశాస్త్రి జ్ఞానప్రసూనాంబికా
98 జ్ఞానబోధ శతకము మట్టపర్తి నడవపల్లి వినుము జ్ఞానబోధ గనుము మనసా
99 కాళహస్తి శతకము (రచయిత తెలియదు) కాళహస్తీశ్వరా ……… సాంబశివా మహాప్రభో
100 గ్రహరాజ శతకము   సరికొండ లక్ష్మీనృసింహ రాజు     గ్రహరాజా

Wednesday, February 13, 2013

శతకసాహిత్యం - ఉపోద్ఘాతం

శతకసాహిత్యం గురించి కొంత ఇంతకు ముందు చర్చించుకున్నాము. సంస్కృత, తమిళ, కన్నడ భాషాసాహిత్యలలో ప్రారంభమైన శతక ప్రక్రియ ఆంద్రసాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. తెలుగులో మొట్టమొదటి శతకము ఏదీ అనే విషయంలో ఇంకా కొంతవాదనలు ఉన్నా పాల్కూరికి సోమనాథకవి 12వ శతాబ్దంలో వ్రాసిన శతకము మొదటి శతకంగా చాలామంది పండితులు అంగీకరించిన విషయం. అప్పటినుంచి ఈనాటివరకు ఈ శతకరచన ఎన్నో క్రొత్తదారులు తొక్కుతు తెలుగు సాహిత్యంలో ఒక విశిస్ఠస్థానాన్ని సంపాదించుకొన్నది అనటంలో ఏమాత్రం సందేహంలేదు. ఆకాలం నుండి నేటివరకు అనేకమంది కవులు ఎన్నో శతకాలను మనకందించారు. అయితే చాలామంది ప్రబంధ కవులు తమ రచనలలో ప్రబంధలను మాత్రమే పేర్కొని శతకరచనలు చేసినా వాటిని పేర్కొనలేదు. కారణాలు మాత్రం అంతగా తెలియరావు. ఎందరోకవులు ఎన్నోసందర్భాలలో చెప్పిన శతకాలు ఇప్పతివరకు ఎన్ని అనేది ఒక అంచనాకి రావటం కష్టమే. "కాదేది కవిత కనర్హం" అన్నట్లు శతకాలు ఒక్క భగవంతుని గురించే కాక అనేక సందర్భాలలో అనేక విషయాలలో చెప్పబడ్డాయి. 

శతక వర్గీకరణ

ముందుగా చెప్పినట్లు శతకాలు అనేక విషయాలపై, అనేక సందర్భాలలో రచించినవి కావటంవలన వానిలో అత్యంత వైరుధ్యం కనిపిస్తుంది. ఈ వైరుద్యాన్ని దృష్టిలో ఉంచుకొని శతకాలను ఈ క్రిందివిధంగా వర్గీకరించవచ్చు.

1. భక్తి శతకాలు : ఈ శతకాలు భక్తిరస ప్రాధాన్యాలు. వీనిని మరల (అ) శివభక్తి, (ఆ) విష్ణుభక్తి, (ఇ) దేవీభక్తి (ఈ) ఇతరదేవతా శతకాలు (ఉ) మానవస్తుతి ప్రతిపాదకాలుగా విభజించవచ్చు. 

2. శృంగార శతకాలు : భగవంతుని శృంగార లీలలను వర్ణిస్తు చెప్పిన వేంకటేశ్వర శతకము, అంబికాశతకము లాంటి శతకాలతో మొదలై కాలక్రమేణా శృంగార రసముతో శతకాలు వచ్చాయి. స్త్రీ, పురుష విరహ వర్ణన, శృంగార భావనలు ఈ శతకాల ప్రధాన విషయం. కలువాయి శతకం, గోరంట్ల మాధవ శతకం, లావణ్య శతకము, భోగినీ శతకము మొదలైనవి ఈ కోవకి చెందుతాయి.

3. నీతి శతకాలు : మనవ మనుగడకి మూలము ధర్మము నీతి. ఈతువంటి నీతిని మానజాతికి సులభంగా అర్ధమయ్యే రీతిలో తెలియచేయటానికి నీతి శతకాలు ఎంతో దోహదం చేస్తాయి. సుమతీ, భాస్కర, కుమారీ, కుమార, మానినీ వంటి శతకాలు ఈ కోవలోకి వస్తాయి. 

4. వేదాంత (తాత్విక) శతకాలు : భగవంతుని చేరే జ్ఞానమార్గాన్ని తెలుపుతూ చేయబడిన శతకాలు. వీనిలో వివిధ మతసిద్ధాంతాలు, తాత్విక విషయాలు, వైరాగ్యమార్గం వంటివి ప్రధాన విషయం. సదానందయోగి శతకము, శివముకుంద శతకము, సంపంగిమన్న శతకము, దత్తయోగీంద్ర శతకము ఈ కోవకి చెందిన శతకాలు.

5. హాస్య శతకాలు : ఇవి హాస్యరస ప్రధాన శతకాలు. ఒక చిన్న విషయాన్ని తీసుకొని నవ్వు పుట్టించే విధంగా వర్ణిస్తూ చెప్పినవి. ఇందులో హాస్యమే ప్రధానాంశం. పొగచుట్ట శతకము, పకోడీ శతకము, విసనకర్ర శతకము, చీపురుపుల్ల శతకము, పిల్లి శతకము లాంటి శతకాలు ఈ కోవకి చెందుతాయి.

6. చారిత్రిక శతకాలు : చారిత్రిక, రాజకీయ సంఘటనల ఇతివృత్తంగా చెప్పిన శతకాలు ఇకోవలోకి వస్తాయి. ఆంధ్రనాయక శతకము, సింహాద్రినారసింహ శతకము, భద్రగిరి శతకము, విశ్వేశ్వర శతకము మొదలైనవి ఈ వర్గంలోకి చెందుతాయి.

7. జీవిత చారిత్రిక శతకాలు : గొప్పవారి జీవిత చరిత్రలు శతకరూపంలో కొంతమది కవులు వ్రాసారు. ఉదాహరణకి కృష్ణమూర్తి శతకము ఈ కోవలోకి వస్తుంది.

8. స్వీయచరిత్ర శతకాలు : కొంతమంది కవులు తమ ఆత్మకధను శతకరూపంలో వ్రాసికొన్నారు. హరిహరేశ్వర శతకము, బిల్పేశ్వర శతకము, కామేశ్వరీ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

9. వ్యాజ్య నిందాస్తుతి శతకములు : కొందరు కవులు తమకు కలిగిన కష్టాలను కానీ, సమాజంలోని అన్యాయాలను కానీ చూచి భరించలేక భగవంతిని ఎత్తిపొడుస్తూ, ఆయనలోని గుణాలను లోపాలుగా చూపిస్తు వ్యాజ్యనిందలో స్తుతించారు. ఆంధ్రనాయక శతకం, విశ్వేశ్వర శతకం, భద్రగిరి శతకం, సింహాద్రి నారసింహ శతకం, వేంకటేశ్వర శతకం మొదలైనవి ఈ కోవలోకి వచ్చే కొన్ని శతకాలు.

10. కథా శతకాలు : కొందరు కవులు ఒక కథాని వస్తువుగా స్వీకరించి ఆ కథను శతకరూపంలో వ్రాసారు. ముకుందరాఘవ శతకం, లవకుమార శతకం, భాగవత ప్రధమ స్కంధ శతకం, భాగవత దశమ స్కంధ శతకము మొదలైనవి కధా శతకాల కోవలోకి వస్తాయి.

11. సమస్యాత్మక శతకాలు : ఇవి ఇచ్చిన ఒక సమస్యను పద్యపాదమకుటంగా చేసుకొని చెప్పిన శతకాలు. సత్యవతీ శతకం, అనుభవరసిక శతకం మొదలైన శతకాలు ఈ పద్ధతిలో వచ్చిన శతకాలు.

12. నిఘంటు శతకాలు : 12 శతాబ్ధంలో వెలువడిన అచ్చతెలుగు నిఘంటువులు శతకరూపంలో ఉండేవి. వేంకటేశాంధ్రం, సాంబనిఘంటువు, ఆంధ్రభాషార్ణవము, మొదలైనవి నిఘంతు శతకాలు.

13. అనువాద శతకాలు : ఇతరభాషల్లో నుండి తెలుగు భాషలోకి అనువదించిన శతకాలన్ని ఈ విభాగంలోకి వస్తాయి. సూర్యశతకం, సౌందర్యలహరి, గాథాసప్తశతి, శివానందలహరి, మొదలైన అనేక సంస్కృత, ప్రాకృత కావ్యాలు శతక రూపంలో తెలుగులోనికి అనువదించ బడ్డాయి.

14. అచ్చతెలుగు శతకాలు : 18వ శతాబ్ధం నుండి మొదలైన అచ్చతెలుగు శతకాలలో ఇతర భాషలు వాడక పూర్తిగా తెలుగు పదాలతోనే శతకరచన చేసిన కవులున్నారు. భళిరా కరివేళ్పు శతకం లాంటివి ఈ కోవకు చెందే శతకాలు.

15. చాటు శతకాలు : సందర్భోచితంగా అనేక విషయాలపై చెప్పిన ఒకే మకుటంగల శతకాలు. రఘుపూరి కేశవ శతకము, రామతీర్థ శ్రీరామ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

ఇంతవైవిధ్యం ఉన్న శతకాలు లభిస్తున్నప్పటికీ మన శతక కవులు శతక రచనకు కొన్ని నియమాలను, కొన్ని లక్షణాలను ఏర్పరుచుకొని ఆ నియమాలను అనుసరిస్తూనే శతక రచనలను సాగించారు. 

శతక లక్షణాలు 

1. సంఖ్యా నియమం: శతకం అనగా వంద. ఈ విధంగా చూస్తే శతకం వందపద్యాలకు పరిమితంకావాలి. ఐతే సంస్కృత సంప్రదాయం అనుసరించి శతకాలలో 100, 108, 116 పద్యాలవరకూ వ్రాయటం ఆచారంగా తీసుకొన్నారు. వంద పద్యాలకు తక్కువగా ఉన్న పద్యాలు కల రచనలను శతకం అనటానికి వీలు లేదు. శతక రచనలో సంఖ్యకు ప్రాధాన్య్త ఉండటం వలన అంతకు పైబడిన పద్యాల రచనలను ద్విశతి (200), త్రిశతి (300), పంచశతి (500), సప్తశతి (700) అనే సంప్రదాయం ఏర్పడింది. వెయ్యిపద్యాలకు పైన ఒకే మకుటంతో ఉన్న పద్యాలున్న రచనలను కూడా శతకంలో చేర్చారు. వేమన పద్యాలు 3000కు పైగా ఉన్నా ఒకే మకుటంతో ఉండటంవలన వేమన శతకం అని పిలవబడుతున్నది.

2. మకుట నియమం: శతకంలోని చివరిపాదం గానీ, పాదాంతంలో గానీ ఒక పేరును సంభోదిస్తూ ఉంటుంది. దీనినే మకుటం అంటారు. ఈ మకుటం సంభోదనా విభక్తియై అన్ని పద్యాలలో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు వేమన శతకంలో విశ్వధాభిరామ వినురవేమ, కాళహస్తీశ్వర శతకంలో శ్రీకాళహస్తీశ్వరా, నారాయణ శతకంలో నారాయణా, అనేవి ఆ శతకాలకు మకుటాలు. 

3. వృత్త లేక చంధో నియమం : శతక మకుట నియమం వలన శతకంలోని ప్రతిపద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలోమాత్రమే వ్రాయటానికి కుదురుతుంది. అందుచేతనే ఈ నియమం ఏర్పడుతున్నది. ఉదాహరణకు దాశరథీ శతకంలో "దాశరధీ కరుణాపయోనిథీ" అనే మకుటం చంపకమాల, ఉత్పలమాల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. అలాగే కాళహస్తీశ్వర శతకంలోని "శ్రీకాళహస్తీశ్వరా" అనే మకుటం మత్తేభ శార్ధూల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. ఐతే ఒకే వృత్తంలో సంపూర్ణ శతకాలు కూడా చాలానే ఉన్నాయి. సీసపద్య శతకాలు, కందపద్య శతకాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

4.రస నియమం : శతకాలన్నిటిలోను ఒకే రసం ప్రతిపాదించబడాలి. భక్తి రస శతకాలలో భక్తిరసంతో కూడిన పద్యాలు మాత్రమే వస్తాయి. వీర, రౌద్ర, హాస్య రసాలకు ఇక్కడ తావు ఉండదు. 

దాదాపుగా మన తెలుగు శతక సాహిత్యంలో పై నియమాలను అనుసరిస్తునే రచనలు చేసారు. ఇప్పటికీ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది కొన్నిచోట్ల ఈ నియమాలను పాటించక రచనలు చేసారు. ఉదాహరణకి సంబోధనా విభక్తి మాత్రమే శతక మకుటలో ఉంటుంది కానీ "రంగశాయి శతకం"లో సంభోదన విభక్తికి బదులు గోపాలుడు రంగశాయి మనపాలగలడు విచారమేటికిన్ అనే మకుటంతో, నార్లవేంకటేశ్వరావు గారి శతకంలో వాస్తవమ్ము నార్లవారి మాట అనే మకుటంతో వ్రాసారు. కొన్ని శతకాలు సంస్కృతాంద్ర మిశ్రమ రచనలైతే, మరికొన్ని అచ్చ తెలుగు శతకాలు మరి కొన్ని గ్రామ్యభాష లో రచించబడ్డాయి. 

దశకవిభాగం: కొన్ని శతకాలలో ఈ దశకవిభాగం అనే ప్రక్రియ కనిపిస్తుంది. అంటే శతకంలోని ప్రతి పది పద్యాలను ఒక విభాగంగా చేసి వానిని ఒక శీర్షిక క్రింద వ్రాయటం. ఉదాహరణకి నారాయణ శతకంలో ఆది, అవతార,, దివ్యరూప, నామ, కృష్ణవతారవిశంతి, జ్ఞానవిశంతి, మోక్షవిశంతి అనే విభాగాలున్నవి. ఇదేవిధంగా భర్తృహరి నీతి శతకంలో, శృంగార, వైరాగ్య శతకాలలో కూడా దశకవిభాగం ఉన్నది.

(ఈ ఉపోద్ఘాతం శ్రీగాజుల సత్యనారాయణ గారి "తెలుగువారి సంపూర్ణ చిన్న బాలశిక్ష" ఆధారంగా వ్రాసినది)