Saturday, December 13, 2014

నారాయణ శతకం - బమ్మెర పోతనామాత్య

శ్రీరమామణి పాణిపంకజ మృదుశ్రీతఙ్ఞ శృం గారాకారశరీర చారుకరుణాగంభీర సద్భక్తమం దారాంభోరుహపత్రలోచన కళాధారోరు సంపత్సుధా పారవారవిహార నాదురితంల్ భజింపు నారాయణా మ. కడకుం బాయక వెయ్యినోళ్ళు గలయాకాకోదరాధీశుఁడున్ గడముట్ట న్వినుతింపలేక నిగుడన్ గ్రాలంగ నొప్పారు మి మ్మడరన్ సన్నుతిసేయ నాదువశమే యజ్ఞాని లోభాత్ముడన్ జడుఁడన్నజ్ఞుడ నైకజిహ్వుఁడ జనస్తబ్ధుండ, నారాయణా. శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యెండెవ్వరిన్ ధ్యానింఫం బ్రణుతింప నట్లగుటకున్నానేర్చు చందంబునన్ నీనామస్తుతు లాచరించునెడల న్నేతప్పులుం గల్గినన్ వానిన్ లోఁగొనుమయ్య తండ్రు! విహిత వ్యాపార, నారాయణా. మ. నెరయ న్నిర్మల మైన నీస్తుతి కథానీకంబు పద్యంబులో నొరుగుల్ మిక్కిలి గల్గె నేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ గుఱుగణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం జెఱుకుం గోలకు తీపు గాక కలదే చే దెందు, నారాయణా మ. చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపంజాలంగ సుజ్ఞానియై మదిలోఁ బాయక నిన్ను నిల్పఁదగు నామర్మంబు నీక్షింపఁడే మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా కది సౌరభ్యపరీక్ష జూడ కుశలేయవ్యక్త, నారాయణా. మ. లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లన్మించెఁ బో నీకధా వలి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్ పెలుచం బూనినయక్కరాటము తుదిన్ బేతేకరాటంబెపో చలదిం దీవరపత్రలోచన ఘనశ్యామాంగ, నారాయణా. మ. ఘనమార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్య మై మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్నార్గమై యెనయున్ సాయక శాయికిం జననియై యేపారుమిన్నేటికిం జనిమూలం బగు నంఘ్రి మాదుమదిలోఁజర్చింతు, నారాయణా శా. నీపుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా నీపుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా నీపాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా నీపెం పేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా. శా. బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్ భవ్యాధినాథుండవై బ్రహ్మేంద్రామర వాయుభుక్పతులకున్ భవ్యాధినాథుండవై జిహ్మవ్యాప్తుల నెన్న నాదువశమే చిద్రూప, నారాయణా మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగసత్పుత్రియై వరుస న్నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా మ. మగమీనాకృతి వార్ధిఁజొచ్చి యసుర న్మర్ధించి యవ్వేదముల్ మగుడందెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ బగ సాధించినదివ్యమూర్తివని నే భావింతు నెల్లప్పుడున్ ఖగరాజధ్వజ భక్తవత్సల ధగత్కారుణ్య, నారాయణా మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడకతో నత్యంతసామర్ధ్యులై భ్రమరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా. శా. భీమాకారవరాహమై భువనముల్ భీతిల్ల కంపింపను ద్ధామోర్విం గొనిపోయి నీరధిలో డాఁగున్న గర్వాంధునిన్ హేమాక్షాసురు వీఁకఁదాకిఁ జయలక్ష్మిన్ గారవింపగ నీ భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా. శా. స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్ దంభోళిం గడువంగ హేమకశి పోద్దండా నురాధీశ్వరున్ శుంభద్గర్భము వ్రచ్చి నానిసుతునిన్ శోభిల్ల మన్నించియ జ్జంభారాతిని బ్రీతిఁదేల్చిన నినుం జర్చింతు, నారాయణా. మ. మహియు న్నాకసముం బదద్వయపరీమాణంబుగాఁ బెట్టి యా గ్రహ మొప్పం బలిమస్తకం బొకపదగ్రస్తంబుగా నెమ్మితో విహరించింద్ర విరించి శంకరమహావిర్భూతదివ్యాకృతిన్ సహజంబై విలసిల్లు వామనల సచ్చారిత్ర నారాయణా. మ. ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై పరగం బైతృక తర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్ నిరువయ్యొక్కటిమారు క్షత్రమరులన్నే పార నిర్జించి త త్పరశుభ్రాజితరామనామము కడున్ ధన్యంబు నారాయణా మ. వరుసం దాటకిఁ జంపి కౌశికు మఘస్వాస్థ్యంబు గావించి శం కరుచాపం బొగిఁద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రి పం పరుదారన్ వనభూమికేఁగి జగదాహ్లాదంబుగా రావణున్ ధరణింగూల్చిన రామనామము కడున్ ధన్యంబు నారాయణా. మ. యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్ మదవద్ధేనుక ముష్టికాద్యసురులన్ మర్ధించి లీలారసా స్పదకేళీరతి రేవతీవదన కంజాతాంతబృంగంబనన్ బిదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణా మ. పురముల్మూడుఁను మూఁడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో వరబోధద్రుమ సేవఁజేయుటకునై వారిం బ్రబోదించియ ప్పురముల్ గెల్చిన మీయుపాయము జగత్పూజ్యంబు నారాయణా మ. కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్చులై కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం బలిగాఁజేయఁదలంచి ధర్మమెలమిం బాలించి నిల్పంగ మీ వలనం గల్క్యావతార మొందఁగల నిన్ వర్ణింతు బారాయణా మ. ఇరవొందన్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబుకా కరయన్ పద్మభవాండ భాండచయమున్నారంగ మీకుక్షిలో నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం తరవాఃపూరము చందమొంది యెపుడున్ దైత్యారి నారాయణా మ. దళదిందీవర నీలనీరదసముద్యద్భాసితాకార శ్రీ లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవ స్థానకో మలనాభీ చరణారవింద జనితామ్నాయాద్య గంగా! లన జ్జలజాతాయతనేత్ర నిన్నుమదిలోఁ జర్చింతు నారాయణా మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయా పాంగ! భూ గగనార్కేందుజలాత్మ పావక మరుత్కాయా! ప్రదీపయ్రో గిగణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణసంసేవితా! త్రిగుణాతీత! ముకుంద! నాదుమదిలో దీపింపు నారాయణా శా. భూతవ్రాతము నంబూజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో పేతంబై పరమాత్మవై నిలుతు నీపెంపెవ్వరుం గాన ర బ్జాతోద్భూత సుజాత పూజత పదాబ్జశ్రేష్ఠ నారాయణా మ. వరనాభీధవళాంబుజోదరమునన్ వాణీశుఁ గల్పించి య ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం మరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ సరి యెవ్వారలు మీరుదక్కఁగ రమాసాధ్వీశ నారాయణా మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం బ్రభవంబైన విరించిఫాలజనితప్రస్వేదసంభూతుఁడై యభిధానంబును గోరి కాంచెను భవుండార్వేశులూహింపఁగా నభవాఖ్యుండవు నిన్నె ఱుంగవశమే యాబ్జాక్ష నారాయణా మ. పటుగర్భాంతరగోళభాగమున నీబ్రహ్మాండభాండంబు ప్రా కటదివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంబోధిపై పటపత్రాగ్రముఁ జెంది యొప్పినమిము న్వర్ణింపఁగా శక్యమే నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ నారాయణా మ. సవిశేషోరుసువర్ణ బిందువిలసచ్చక్రాంకలింగా కృతిన్ భవిచే నుద్దవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే ధ్రువుచే నా దివిధినాయకులచే దివ్యన్మునీంద్రాళిచే నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ నారాయణా మ. సర్వంబున్ వసియించు నీతనువునన్ సర్వంబునం దుండఁగా సర్వాత్వా! వసియించు దీవనిమదిన్ సార్ధంబుగాఁ జూచి యా గీర్వాణాదులు వాసుదేవుఁడనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ నారాయణా మ. గగనాద్యంచిత పంచభూతమయమై కంజాత జాండావలిన్ సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా సుగుణంబై విలసిల్లుదీవు విపులస్థూలంబు సూక్షంబునై నిగమోత్తంస గుణావతంస సుమహా నిత్యాత్మ నారాయణా మ. ఎలరారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నెట్లో పెడున్ కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్టంబుపైఁ గీటముల్ నిలువన్నేర్చునె భక్తపోషణ కృపానిత్యాత్మ నారాయణా మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్ వెలయన్ ఘోరసమీరణస్ఫురణచే వేపాయుచందంబునన్ జలదంభోళిమృగాగ్ని తస్కర రుజా శత్రోరగవ్రాతముల్ దొలఁగున్న్మీగదు దివ్యమంత్రపఠనన్ దోషాఘ్న నారాయణా మ. కలుషగాథా వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో నలర న్నెవ్వానివాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయున్ వెలయన్ భూరుహకోటరంబదియ సూ వేదాత్మ నారాయణా మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్ధోరగ యక్షపక్షిముని రక్షోహృద్గుహాభ్యంతర స్థిరసుజ్జానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై సరిలేకెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు నారాయణా మ. అధికాఘౌఘతమో దివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్ సుధయై వేదవినూత్న రత్నములకున్ సూత్రాభిధానంబునై బుధసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్ విధులై మీబహునామరాజి వెలయున్ వేదాత్మ నారాయణా మ. పొనరన్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం దునికిస్థానము యిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దునున్ ఘనపాపంబులవైరి షడ్రిపులకున్ గాలావసానంబు మీ వినుతాంఘ్రి ద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా మ. భవరోగంబులమందుపాతకతమౌ బాలార్క బింబంబు క ర్మ విషజ్వాలసుధాంశుగామృతతుషార వ్రాతపాథోధిమూ ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై భువిలో మీదగుమంత్రరాజ మమరున్ భూతాత్మ నారాయణా మ. వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండుమీ తిరుమంత్రంబగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ నారాయణా మ. హరునిన్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం గరిఁ బ్రహ్లాదు విభీ'ణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదున్ గరమొప్ప న్విదురున్ బరశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్ నరునక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు నారాయణా శా. శ్రీకిన్మందిరమైన వక్షము సురజ్యేష్ఠోద్భవస్థాననా భీకఁజాతము చంద్రికాంతర సుధాభివ్యక్తనేత్రంబులున్ లోకస్తుత్యమరున్న దీజనక మాలోలాంఘ్రియున్ గల్గు నా లోకారాధ్యుడవైన నిన్నెప్పుడు నాలోఁజూతు నారాయణా శా. విందుల్ విందులటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ డందెల్ మ్రోయఁగ ముద్దుమో మలర ని న్నాలింగితున్ సేయుచో డెందముల్ దనివార రాగరసవీటీలీలలన్ దేల్చుమీ మందస్మేరముఖేందురోచులు మము న్మన్నించు నారాయణా శా. విందుల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబెపొమ్మయ్యయో నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁ బోవేమి మా మందం జాతరసేయఁ బోదమిదే రమ్మా యంచు మిమ్మెత్తుకో చందంబబ్బిన నుబ్బకుండుదురే ఘోషస్త్రీలు నారాయణా శా. అన్నా కృష్ణమ నేఁడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో వెన్నల్ ముట్టకు మన్ననాక్షణము నన్విశ్వాకృతిస్ఫూర్తివై యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి ని న్నోలి న్నుతుల్ సేయుచున్ గన్నుల్ మూయ యశోదకున్ జిఱుతవై కన్పించు నారాయణా శా. ఉల్లోలంబులుగాఁ గురుల్ నుదుటిపైనుప్పొంగ మోమెత్తి ధ మ్మిల్లం బల్లలనాడ రాగరస సమ్మిశ్రంబుగా నీవు వ్రే పల్లెందాడుచు గోపగోనివహ గోపస్త్రీలయుల్లంబు మీ పిల్లంగ్రోవిని జుట్టిరాఁదిగుదు నీపెంపొప్పు నారాయణా మ. కసవొప్పన్ పసి మేసి ప్రొద్దుగలుగం గాంతారముం బాసి య ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా రసవద్వృత్తపయోధరద్వయహరిద్రాలేపనామోదముల్ పసిఁ గొంచున్ బసిఁ గొంచువచ్చుటలు నే భావింతు నారాయణా శా. చన్నుల్ మీఁదికి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం పన్నాఖ్యంబు నటించుమాడ్కి కబరీభారంబు లూటాడఁగ విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ వన్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు నారాయణా మ. పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా గరసావేశత రిత్తద్రచ్చనిడ నాకవ్వంబు నీవు న్మనో హరలీలం గనుంగొంచు థేనువని యయ్యాఁబోతునుం బట్టితీ వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు నారాయణా శా. కేలన్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం బీలీపింఛముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళిన్ గట్టి క ర్ణాలంకారకదంబగుచ్చమధుమత్తాలీస్వనంబొప్పనీ వాలన్ గాచినభావమిట్టిదని నే వర్ణింతు నారాయణా శా. కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయన్ సము త్తాలాలోల తమాలపాదపళిఖంతస్థుండవై వేణురం ధ్రాలిన్ రాగరసంబునిండ విలసద్రాగంబు సంధించి గో పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు నారాయణా శా. రాణించెన్ గడునంచు నీసహచరుల్ రాగిల్లి సోలంగ మీ వేణుక్వాణము వీనులంబడి మనోవీథుల్ బయల్ ముట్టఁగా ఘోనాగ్రంబులు మీఁదికెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు నారాయణా

మ. పసులంగాపరి యేమెఱుంగు మధురప్రాయోల్లాసద్వృత్తవా
గ్విసరారావము మోవిదా వెదురు గ్రోవిం బెట్టి నాఁడంచు నిన్
గసటుల్ సేయఁగ నాఁడు గోపికల తద్గానంబులన్ మన్మథ
వ్యసనాసక్తలఁ జేయుచందములు నేవర్ణింతు నారాయణా

మ. జడియొంతేఁ దడవయ్యె జెయ్యియలసెన్ శైలంబు మాచేతులం
దిడుమన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తిగీపెట్టనె
క్కుడుగోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలంగోవర్ధనాద్రీద్రమున్
గొడుగైయుండగఁ గేలఁబూనితిగదాగోవింద నారాయణా

మ. లలితాకుంచితవేణి యందడవి మొల్లల్ జాఱ ఫాలస్థలిన్
దిలకం బొయ్యనజాఱఁ గుండలరుచుల్ దీపింపలేఁ జెక్కులన్
మొలకన్నవ్వుల చూపులోరగిల మేన్మువ్వంకన్ బోవఁగ
నలిగైకొందువుగాదె నీవు మురళీనాట్యంబు నారాయణా

శా. మాపాలం గడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ
మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తాగొల్లలన్
మాపాంగల వేల్పు నీవెయని కా మన్నింతు నారాయణా.

మ. ఒక కాంతామణి కొక్కడీవు మఱియున్నొక్కరై కొక్కండవై
సకలస్త్రీలకు సంతసంబలర రసక్రీడతన్మధ్య క
ల్పకమూలంబున వేణునాదరస మొప్పంగా, బదార్వేలగో
పికలంజెంది వినోద మొందునెడ  నీపెంపొప్పు నారాయణా

మ. లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
బలుఁగుల్వారఁగ నీకటాక్షమునఁ దామందంద గోపాంగనల్
తలఁపుల్పాదులుకట్టి కందళితనూత్న శ్రీలు వాటింతురా,
నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీయొప్పు నారాయణా

శా. లీలన్ బూతకిప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి దు
శ్శాలుండై చనుబండిదానవు వెసంజిందై పడందన్ని యా
రోలన్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలం గంసునిఁగొట్టి గోపికలకోర్కుల్ దీర్తు నారాయణా

మ. రసనాగ్రంబున నీదునామరుచియున్ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జ ముగ్మంబులన్
వెసనీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞాన మధ్యాత్మకున్
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూవేదాత్మ నారాయణా

మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెరవొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించుటొప్పును సితాంభోజాక్ష నారాయణా

శా. చల్లల్వేఱొకయూర నమ్ముకొను నాసంబొవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్
చల్లన్ జల్లనిచూపు జల్లుమని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరు తెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా

మ. కలయన్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్ భక్తిహీనుఁడైనపిదపన్ వ్యర్థప్రయత్నంబెపో
గులకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబు దా
ఫలకాలంబున నీచపోవుపగిదిన్ పద్మాక్ష నారాయణా

శా. స్నానంబుల్ నదులందుజేయుట గజస్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించువేదమటనీ మధ్యంబులో నేడ్పగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చునెయ్యై చను
న్నినామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా

మ. అలనీటందగు రొంపిపైఁ జిలికిన న్నానీట నేపాయు నా
యిలపాపంబులు దుర్భరత్వము మహోహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁ దోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుంగాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా

మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం
తున బంధించిన బంధనంబుకతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధియైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా

మ. తనువుం జీవుఁడు నేకమైనపిదపన్ ధర్మక్రియారంభుఁడై
యనయంబున్మది దన్నెఱుంగక తుదిన్నామాయచే మగ్నుఁడై
తనుతత్వాది వియోగమైనపిదపం దానేర్చునే నీదుద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా

మ. తనకున్ సాత్వికసంపదాన్విత మహాదాసోహ భావంబునన్
ననయంబున్మది నన్యదైనభజనం బారంగ దూలింపుచున్
జనితాహ్లాదముతోడ నీ చరణముల్ సద్భక్తి పూజించి నిన్
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా

మ. పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబుగా మీఁద మీ
చరణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయన్నేర్చునె దుర్లభంబగు గృపాంభోజాక్ష నారాయణాఉ

మ. పరమజ్ఞాన వివేక పూరిత మహాభవ్యాంతరాళంబునన్
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తిన్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త నారాయణా

మ. సరిఘోరంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబు పై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతి దర్పణమున న్నిస్సంగుఁడై తన్నుదా
నరయం గాంచిన వాఁడు నిన్నుఁ గనువాఁడబ్జాక్ష నారాయణా

మ. పరుషాలాపములాడ నోడి మదినీపాపార్జన నారంభుఁడై
నిరసించేరికిఁ గీడుసేయక మది న్నిర్ముక్త కర్ముండునై
పరమానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించునా
పరమజ్ఞాని భవత్కృపం బొరయ నో పద్మాక్ష నారాయణా

మ. ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంతమం
దరయంబైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
మరణావస్ఠను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా

మ. వెరవొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వేతెల్పిమీ
వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంద్సారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోలనేరరు వెసన్ దైత్యారి నారాయణా

శా. వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాసపరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁడంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
శ్రీదేవీ వదనారవింద మధుపా శ్రీరంగా నారాయణా

మ. సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
మృతిఁబొందించి దమంబునన్ శమమున్ మీఱంగవర్తించు ని
ర్గతసంసారి భవత్కృపంబొరయ నో కంజాక్ష నారాయణా

మ. ప్రమదం బారగఁ పుణ్యకాలగతులన్ భక్తిన్ననుష్ఠింపుచున్
నమర న్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణిగ్రామదా
నము లామ్నాయవిధోక్తి భూసురులకున్ సన్మార్గుఁడై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁడగు న్నామీఁద నారాయణా

మ. ఇల నెవ్వారిమనంబులో నెఱుకదా నెంతెంత గల్గుండునా
కొలదింజెంది వెలుంగుచుందు కలయన్గోవింద నీరూపులన్
యలర న్నంబు మితంబులై సరసిలో నంభోరుహంబుల్ దగన్
నిలనొప్పారెడుతందమొందెదెపుడు న్నీలాంగ నారాయణా

మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
గదియం జేర్చినవానికేనొడయఁడన్ గాదంచు సత్యున్నతిన్
పదిలుండై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంతపుణ్యులో కృపాపారీణ నారాయణా

మ. కులమెన్నంగొలదేల యేకులజుఁడుం గోత్రాభి మానాభిలా
షలు నజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబుసోఁకు నినుమున్ హేమాకృతస్తోమమై
వెలయు న్నాగతి వాఁడుముక్తికరుగున్ వేదాత్మ నారాయణా

మ. నిరతానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నంగులై మ్రగ్గువై రరయ
న్నిన్నొగి నాత్మయుం దిడనివా రబ్జాక్ష నారాయణా

మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యలై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొవరన్నొప్పెడువారు నీపదరుచుల్ యూహించు నారాయణా

మ. విదితామ్నాయ నికాయభూతములలో విజ్ఞానసంపత్కళా
స్పదయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా

మ. వెలయన్ యౌవనకాలమునందు మరుడుఁన్ వృద్ధప్యకాలంబునన్
బలురోగంబులు నంత్యమందు యముఁడుం బాధింపఁనట్లైన యీ
పలుజన్మంబులు చాలదూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁజూపు నారాయణా

మ. బలుకర్మాయుత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
జలయంత్రాన్వితబంధయాతనగతిన్ సంసారకూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా

మ. మమహంకారవికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రాదింక నాలోన
విమలాపాంగదయాదివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష నారాయణా

మ. పరిపంథిక్రియ నొత్తి వెంటఁబడు నప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవధ్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్మీకపకీర్తిగాదె శరదాంభోజాక్ష నారాయణా

మ. సతతాచారము సూనృంతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్ నధ్యాత్మయున్ ధ్యానమున్
దృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబుగాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాససుఖమున్ మానాథ నారాయణా

మ. భవనాసిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణ
వేత్రావతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగయుం
దవగాహంబున నైనపుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
భవదంఘ్రీ స్మరణంబునం గలుగు నోపద్మాక్ష నారాయణా

మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దాద్రోహముం జేసినన్
పరగం జెల్లుట సూచితీ భువన సంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దానదాసినని దుర్వారౌఘముల్ జేసితిన్
కరుణంజేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా

మ. గణుతింపన్ బహుధర్మశాస్త్ర నిగమౌఘం బెప్పుడు న్ని న్న కా
రణబంధుండనిచెప్ప నతైఱఁగు దూరంబందకుండంగనే
బ్రణతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడిలేకుండినన్
ఋణమానానుతి నీవు శ్రీపతివి నీకేలప్పు? నారాయణా

మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణంబన్నఁ గృశానుభాను శతతేజస్ఫూర్తియైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
పరసద్భక్తభయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా

శా. ఏభావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌపదయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీనీకృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా

శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునిన్
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్
నీలగ్రీవుఁడు మించిత్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
నీలగ్రీవమఖాబ్జభాస్కరకృపానిత్యాత్మ నారాయణా

మ. నినువర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనులన్
విని మోధింపనివాండు చెవ్డుమరినిన్ వేడ్కన్ మనోవీధినిన్
గనిపూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుండై
తనలోఁ గాననివాఁడు నీచమతివో తత్వజ్ఞ నారాయణా

మ. నినువర్ణింపని నీచబంధమతి దానిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబుతా
ననలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూనివే
ల్చినచందంబున వ్యర్ధమై తనరు, జూచిద్రూప నారాయణా

మ. నిను వర్ణింపని జిహ్వదాఁబదటికా? నీలాభ్రదేహాంగకా
నినునాలింపనిచెవులు దాఁబదటికా! నీరజపత్రేక్షణా
నినుఁబూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపనియాత్మ దాఁబదటికా? నిర్వాణ నారాయణా

శా. నీవేతల్లివి నీవేతండ్రి వరయన్నీవే జగన్నధుఁడౌ
నీవేనిశ్చలబాంధవుణ్డ వరయ న్నీవేమునిస్తుత్యుఁడౌ
నీవేశంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్
నీవేదిక్కను వారి వారలె కడు న్నీవారు నారాయణా

మ. అపరాధంబులు నిన్ను నమ్మి వినుమే నాజన్మపర్యంతమున్
విపరీతంబుగఁ జేసినాఁడనిఁక నీవేదిక్కు నాలోనికిన్
గపటం బింతయులేక దండధరుకుం గట్టీక రక్షింపుమీ
కృపకుం బాత్రుఁడనయ్య ధర్మపురిలక్ష్మీనాథ నారాయణా

శా. చెల్లంజేసితి పాతకంబులు మదిన్ శ్రీనాధ మీనామముల్
పొల్లుల్ బోవనినమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
చెల్లం బోనను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిందండ్రియు నీవుగాక యొరులో తర్కింప నారాయణా

మ. నరసింహాచ్యుత వాసుదేవ విక సన్నాళీకపత్రాక్షభూ
ధరగోవిందముకుందకేశవ జగత్త్రాతాహితల్పాంబుజో
దరదామోదరతార్క్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం
దిరపీతాంబరభక్తవత్సల కృపన్ దీపింపు నారాయణా

మ. కడకంట గడలేని సంపదలొగిం గావింపు లక్ష్మీశపా
ల్కడలిన్ బన్నగశాయివై  భువనముల్ గల్పించు సత్పుత్రినిన్
బొడమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతింగన్న పదార విందముల నే భావింతు నారాయణా

మ. తపముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్ధసేవాఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
ఉపవాస వ్రతశీలకర్మ ఫలముల్ యొప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయిన్నేల నారాయణా

శా. శ్రీనారాయణా యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గునంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నేనేనెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా

మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబునన్
అలరన్నెవ్వాని వాక్కునం బొరయదో యన్నీచుదేహంబు దా
వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా

మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
పము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రఖ్యకా
వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా

శా. నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీపాదనిర్మాల్య ని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్
నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబున 
సర్వంబును సంపూర్ణము.

Wednesday, December 3, 2014

శతకాల పట్టిక 7

శ్రీవశీరప్పగారి రామకృష్ణగారి  శతకాల పట్టిక  - 2

101. శ్రీసత్యనారాయణ శతకము, డా. తూములూరు మేధా దక్షిణమూర్తిశాస్త్రి, 2000,  సత్యనారాయణా
102.  శ్రీసత్యదేవ శతకము, కనకం అప్పలస్వామి, 1990, సర్వరక్షకస్వామి శ్రీ సత్యదేవ
103 శ్రీసత్యనారాయణ శతకము వేంగళ రామకృష్ణ 1989 శ్రీసత్యనారాయణా
104 శ్రీపైలుబండ రంగనాథస్వామి శతకము శివరాంకుమార్ రామచంద్రరావు, 1962, రంగనాయకా
105 శ్రీరంగనాధ శతకము, శ్రీత్రిదండి శ్రీకృష్ణయతీంద్ర రామానుజజీయరుస్వామి, రక్షకుండ నీవె రంగనాథ
106 శ్రీహరి శతకము కె. ఎన్. నరసింహమూర్తి, 2007, శ్రీహరీ భక్తపాలకా శ్రీనివాస
107 సద్దలోనిపల్లి ముద్దుకృష్ణ శతకము, వెలుదండ సత్యనారాయణ, 2010, సద్దలోనిపల్లి ముద్ధుకృష్ణ
108 కృష్ణ నమస్కార శతకమురచయిత తెలియదుకృష్ణస్వామికిన్ మ్రొక్కెదన్
109 శ్రీలక్ష్మీనరసింహ శతకము, తాటిమాను నారాయణరెడ్డి, 2002, లక్ష్మీనరసింహప్రభో
110 వేదాద్రి నారసింహ శతకము, కోగంటి వీరరాఘవాచార్యులు, 2010, వికృతరాక్షసగజసింహ విదళితాంహ, నవ్యగుణరంహ వేదాద్రినారసింహ
111 కదిరినృసింహ శతకము, కోగంటి వీరరాఘవాచార్యులు, 2011, కదిరి నృసింహా
112 ముద్దులేటి శ్రీలక్ష్మీనృసింహ శతకము, కాసా చిన్నపుల్లారెడ్డి, 2008, శ్రీముద్దులేటయ్య లక్ష్మీనృసింహ
113 గర్తపురి నృసింహ శతకము, చింతపల్లి నాగేశ్వరరావు, 2013, గర్తపురి నృసింహ ఆర్తరక్ష
114 శ్రీపెంచెలకోన నృసింహ  శతకము, డా. రామ్మడుగు వేంకటేశ్వరశర్మ, 2012, పెంచెలకోన నృసింహదేవరా
115 తరిగొండనృసింహ శతకము, తరిగొండ వెంగమాంబతరిగొండ నృసింహ దయపయోనిధీ
116 శ్రీనరసింహస్వామి శతకము, పి. లక్ష్మీనరసప్ప, 1998, నృహరీ
117 శ్రీదుందిగల్ ఆంజనేయశతకము, శంకుశంభుని కుమార్ , 2012, దుందిగల్లీశ హనుమంత దురితనాశ
118 సప్తగిరిధామ కలియుగసార్వభౌమ శతకము, డా. రాళ్ళబండి కవితా ప్రసాద్, 2011, ప్రణవ సుమధామ నిగమపరాగ సీమ సప్తగిరిధామ కలియుగసార్వభౌమ
119 శ్రీవేంకటేశ్వర శతకము, యమ్మనూరు సూర్యనారాయణ , 2008, వేంకటేశ్వరా
120 శ్రీవేంకటేశ్వర శతకము, మద్దూరి రామమూర్తి, 2002, వేంకటేశ్వరా
121 శ్రీవేంకటేశ్వర శతకము, బండికాడి అంజయ్యగౌడ్, 2008, వేంకటేశ్వరా
122 శ్రీఇందుపురీశ్వర వెంకటేశ్వర శతకము, కందాళై లక్ష్మీనరసింహాచార్యులు, శ్రీగణపతి రామచంద్రరావు, 1990 ఇందుపురీశ్వరా వెంకటేశ్వర
123 శ్రీవేంకటేశ్వర శతకమునాగపురి శ్రీనివాసులు, 2006, సంకటవినాశ శరణు శ్రీవేంకటేశ
124 శ్రీశ్రీనివాస శతకము, తిరువీధుల జగన్మోహనరావు , 2012, శేషశైలవాస శ్రీనివాస
125 శ్రీవేంకటేశ్వర శతకము, ఆదిమూలం నారాయణ ఆచారి, 2010, వేయిపడగలనీడను వెలసినావు, వేగమముకావు మహదేవ వేంకటేశ
126 దశావతార శ్రీగోవింద శతకము, అయ్యపురాజు శ్రీవీరనారాయణ రాజు, 1985, గోవిందా
127 శ్రీ వేంకటేశ్వర శతకము, డా. సీ.వి.సుబ్బన్న శతావధాని , 2004, వేంకటేశ్వరా
128 శ్రీ వేంకటేశ్వర శతకము, కరణం సుబ్రహ్మణ్యం, 2006, వెంకటేశ్వర శ్రీకరరూప
129 శ్రీవేంకటేశ్వర పెరుమాళ్ళ శతకము, డా. రాధాశ్రీ, 2008, వేంకటేశ్వర పెరుమాళ్ళు వేదవినుతా
130 నాస్వామి (శ్రీశ్రీనివాస శతకము), శంకరంబాడి సుందరాచారి, 2009, శ్రీనివాసా
131 శ్రీ శ్రీనివాస శతకముకాసా చిన్నపుల్లారెడ్డి, 2008, శిష్ఠజనపాల శ్రీధర శ్రీనివాస
132 శ్రీవేంకటాద్రీశ్వర శతకము, గాడేపల్లి సీతారామమూర్తి, 1997, వెంకటాద్రీశ్వరా
133 శ్రీనారాపుర వెంకటేశ్వర శతకము, అనుముల బదరీనారాయణ, 2010, సాంద్ర నారాపురేంద్ర సురేంద్రవంద్యా
134 వెంకటేశ్వర శతకము, తిరుపతి రామచంద్ర కవి, 1974, వెంకటేశ్వర
135 శ్రీ శ్రీనివాస శతకము, కె. రామకృష్ణ పిళ్ళె, 1967, శ్రీనివాసా
136 శ్రీవేంకటేశ్వర శతకము, వీరా సూర్యనారాయణ, 2007, వేంకటేశ్వరా
137 శ్రీవేంకటేశ్వర శతకము, గంగదారి యాదగిరి, 2012 వేంకటేశ్వరా
138 శ్రీవేంకటేశ్వర శతకము, నెమ్మాని రామమూర్తి, 2004, స్వామీ కరుణించి నన్ను కాపాడరమ్ము, సంకటవినాశ తిరుపతి వెంకటేశా
139 నైమిశవెంకటేశ శతకము, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, 2012, నైమీశ వెంకటేశ
140 ప్రణతివట్టెం శ్రీవెంకటపతి శతకము, కుంతీపురం కౌండీన్య తిలక్, 2011, వట్టెం నివాస వేంకటరమణా
141 హోసూరుబండాంజనేయ శతకము, కె. ఎన్. ణరసింహమూర్తి, 1997 అప్రమేయ హోసూరు బండాంజనేయ
142 శ్రీబుద్దారం గండి ఆంజనేయస్వామి శతకముయంతి. జహంగీర్, 2005, అంజనీపుత్ర గండిశ్రీ ఆంజనేయ
143 శ్రీవెల్లాల సంజీవరాయ శతకము, కాసా చిన్నపుల్లారెడ్డి, 2009, శ్రీకపీశ వెల్లాల సంజీవరాయా
144 శ్రీరామభక్త హనుమ శతకము, మేకల రామస్వామి, 2006, శరణు రామభక్త హనుమ శౌర్యతేజ
145 శ్రీవీరాంజనేయ శతకము, శ్రీదక్షిణామూర్తి శాస్త్రి, 1999, అభయమొసగుము నాకు వీరాంజనేయ
146 హనుమ శతకము, బగ్గారం ప్రసాదరావు, 2009, అనఘుడాలను మరకత హనుమ శరణు
147 శ్రీఆంజనేయ శతకము దాదన చిన్నయ్య, 1993, అమరనికర గేయ ఆంజనేయ
148 వీరాంజనేయ శతకము, సి. వి. సుబ్బన్న శతావధాని, వీరాంజనేయ సజ్జనగేయా
149 శ్రీమారుతాత్మజ శతకము, మద్గుల ఆదినారాయణశాస్త్రి, 2011, మారుతాత్మజ హనుమంత మాన్యచరిత
150 శ్రీ హనుమత్ శతకము, బండకాడి అంజయ్యగౌడ్, 2011, హనుమా
151 శ్రీమిట్టబండ హనుమచ్ఛతకము, కె. నాగప్ప, 2002, శ్రీమిట్టబండ హనుమద్దేవా
152 శ్రీషిరిడి సాయి శతకము, మూలా పేరన్న శాస్త్రి, 1981, షిరిడీ సాయి సుధ కరుణా సుధాంబుధీ
153 శ్రీసాయిసద్గురు శతకము, పి. హుస్సేన్ సాహేబ్, 2007, సాయి సద్గురూ
154 శ్రీసాయి దేవోత్తమ శతకమువిప్పగుండ రాజగోపాలరావు, 2005, శ్రీసాయి దేవోత్తమా
155 శ్రీసాయీ శతకము, కె.రాజేశ్వరరావు, షిరిడిపురవాస సాయీశ చిద్విలాసా
156 షిరిడిసాయి శతకము, సుస్వరం కృష్ణమూర్తి, 2009, సకలగుణసాంద్ర సాయిచంద్ర
157 శ్రీసత్యసాయిరామ అక్షరార్చన శతకము, వెలుదండ రామేశ్వరరావు , 2004, సాధునుతనామ శ్రీసత్యసాయిరామ
158 శ్రీసత్యసాయినాథ శతకమురేకపల్లి శ్రీనివాసమూర్తి, 1993, సర్వవంద్య సత్యసాయినాథ
159 శ్రీషిరిడీసాయి శతకము, శనవతి పాపారావునాయడు, 2003, చేరి గొలుతు నిన్ను షిరిడిసాయి
160 భగవాన్ శ్రీసత్యసాయి శతవసంతం, డా. రాధాశ్రీ, 2010, శరణు సత్యసాయి శరణు శరణు
161 శ్రీసాయి నందగీతులు, నందగిరి అనంతరాజశర్మ, 2003, నందగిరి గీతులివే సాయినాథ కొనుము
162 శ్రీరామ కృష్ణాంజలి, అనుభవానంద స్వామి, 2012, శ్రీరామకృష్ణ మహాప్రభు
163 దక్షిణేశ్వరీ శతకము, అనుభవానంద స్వామి, 2012, దక్షిణేశ్వరీ
164 చిత్తప్రభోద శతకము, అనుభవానంద స్వామి, 2012, చిత్తమా
165 అనుభవానందము, అనుభవానంద స్వామి, 2012, అనుభవానందుడన్ బ్రహ్మమనగ నేను
166 శ్రీపోతులూరి వీరబ్రహ్మ శతకము, ఓరా విశ్వనథ కవివీరబ్రహ్మ చింతామణి
167 శ్రీరాఘవేంద్ర శతకము, సుస్వరం కృష్ణమూర్తి , 2008, రామచంద్రభక్త రాఘవేంద్ర
168 శ్రీశ్రీపాదరాజ శతకము, సుస్వరం కృష్ణమూర్తి, 2008, శ్రీధ్రువాంశ తేజ శ్రీపదాబ్జ
169 మేహరీశ్వర శతకము, సామల రాజమల్లయ్య, 1996, మెహరీశ్వరా
170 రాజరామాఖ్య శతకము, సామల రాజమల్లయ్య, 2006, రాజరామాఖ్య గురు మహారాజ రాజ
171 గురురాఘవేంద్ర చరితము(శతకము), శ్రీమతి. ఎన్. సత్యభామ, 2000, రాఘవేంద్ర పరమయతింద్రా
172 మారవీ (భక్తి శతకము), శ్రీజో స్యము విద్యసాగర్, 2009, మారవీ
173 శ్రీసుజనా భక్తి శతకము, ఉక్సం రమణయ్యా, 2012, సుజనా
174 శ్రీసుగుణా భక్తిశతకము, ఉక్సం రమణయ్యా, 2012, సుగుణా
175 వరాహ శతకము, డా. ఆచార్య ఫణీంద్ర, 2010, వరాహమా
176 శ్రీమదంబేద్కర విజయసింహ శతకము, విజయ కుమార్, 2003, విజయసింహ జైభీం
177 విజయసింహ శతకము, విజయ కుమార్, 2000, వినుర కవికుమార విజయసింహ
178 నవ్యంధ్ర సుమతీ శతకము, బాగు సూర్యనారాయణ, 2008, సుమతీ
179 నవీన సుమతీ శతకము, కాసుల నాగభూషణం, 2014, సుమతీ
180 కుమతీశతకము వాసా కృష్ణమూర్తి, కుమతీ
181 గాంధీ వాణి, కలపాల సూర్యప్రకాశరావు, 1988, గాంధీ
182 ఉమ్మెత్తుల శతకము, ఉమ్మెత్తుల లక్ష్మీ నరసింహమూర్తి, 2012, అప్పుదొరికించుకోవోయి అదియె గొప్ప
183 సుమంత శతకము, శింగిసెట్టి సంజీవరావు, 2010, ముసిమి గ్రుచ్చి సూత్రుల తాల్పు శ్రీసుమంత
184 మనిషి శతకము, దర్పూరి శ్రీధరాచార్యులు, 2004, మనిషీ
185 మనసా శతకము, కరణం సుబ్రహ్మణ్యం , 2006, మనసా
186 అహంకార శతకము, డా. కడిమిళ్ళ వరప్రసాద్, 2010, అహంకారమా
187 శిష్య శతకము, డా. కడిమిళ్ళ వరప్రసాద్, 2013, శిష్యా
188 వికృతిస్వాగత శతకము, గుడిసేవ విష్ణుప్రసాద్, 2010, వికృతి వత్సరంబ విభవమిమ్మా
189 శ్రీవిరించి శతకము, కడిమిళ్ళ శ్రీవిరించి, 2009, శ్రీవిరించి
190 విబుధ రామ శతకము, దర్భా శ్రీరాం, 2012, విభుదులాడుమాట వినవె రామ
191 మిత్ర శతకము, వేపూరి శెషగిరిరావు, 1998, మిత్ర
192 రమణ శతకము, డా. జి. వేంకట రమణ, 2010, వినుము రమణ వాక్కు వీనులాగ్గి
193 శ్రీరమణ శతకము, అమరవేణి వేంకటరమణ గౌడ్, 2004, రమణా
194 దాశరథీ శతకము, దాశరథి కృష్ణమాచార్యులు, 1962, దాశరథీ కరుణాపయోనిధీ
195 శ్రీగురుదత్త శతకము, కె. సాంబమూర్తి, 2002, దయనుగావవే సద్గురు దత్తరూప
196 శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామివారి శతకము, బందకాడి అంజయ్యగౌడ్, కృష్ణానందా
197 మనోబోధ శతకము, గురువయ కవి, 2010, మనసా సర్వేశు చింతించుమా
198 సద్గురు శతకము, సిద్దేశ్వర కాల్లప్పకవి, 1999, సద్గురూ
199 మనసా శతకము-మానస సరోవరం, సిద్దేశ్వర కాల్లప్పకవి, 1999, మనసా
200 చిత్తరంజన శతకమువారణాసి వేంకటరత్నం శర్మ, 1993, చిత్తమా