మిత్రులందరికి నమస్కారం
ఈమధ్య కొన్ని పనుల ఒత్తిడివలన పోష్టులు వెయ్యలేకపోయినాను. మొత్తం 516 శతకాల లిష్టు పూర్తిచేసి మీఅందరితో పంచుకున్నాను. ఇందులో దాదాపు 38 శతకాలు మాత్రం నావద్ద లేవు. మిగిలినవి ఉన్నవి. ఐతే ఈ పని ఇంతటితో ముగియలేదు. ఇంతకుముందు చెప్పినవిధంగా వేలసంఖ్యలో ఉన్న శతకాలతొ పోలిస్తే దొరికినవి చాలా స్వల్పం. దొరికిన వానిలోకూడా చాలవరకు అసంపూర్ణం గానే ఉన్నాయి. మరికొన్ని scan సరిగాలేక అక్షరాలు సరిగా కనపడటంలేదు. మిగిలినవి ఎలా సంపాదించాలి అన్నదే నా ప్రస్తుత ఆలోచన ప్రయత్నం. అందులో భాగంగా మీఅందరికి నాదొక్క మనవి. మీవద్ద ఏమైనా శతకములు గనక ఉంటే దయచేసి నాకు పంపగలరు. scan copy ఐనా, pdf ఐనా లేకపోతే ఇకేవిధమైన format లొ పంపినా మీపేరున అది బ్లాగులో పోష్టు చేయ్యగలను. పని కొంచం కష్టమైనదే అని నాకు తెలుసు. అయినప్పటికీ ఆంధ్ర భాష, సాహిత్యా భిమానులైన మీరు తప్పక సహాయం చెయ్యగలరని నాకు విశ్వాసం.
కందుకూరి వీరేశలింగం పంతులు గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు, మొదలైన ఆధునిక కవులు కూడా అనేక శతకాలను రచించారని చదివాను కానీ వీరి శతకాలు మచ్చుకు ఒక్కటైనా సంపాదించలేకపోయినాను.
ఇకపోతే నా భవిష్యత్తు కార్యక్రమం ఇలా ఉన్నది. దొరికిన శతకాలను ఒక్కక్కటే మీతో పంచుకొంటాను. త్వరలోనే శతకాల పొష్టులను ప్రారంభిస్తాను
మీ ప్రోత్సాహ సహాయాలను ఆశిస్తు
సుబ్రహ్మణ్యం
dsm1959@rediffmail.com
లేక devarakonda.subrahmanyam@gmail.com
అయ్యా, నమస్కారములు. మీ చరవాణి సంఖ్య తెలుపగలరు. మా తాతగారి పద్యములు పరిచయము చేయగలవాడను..........కొర్నెపాటి విద్యాసాగర్, మేనేజర్,భారతీయ స్టేట్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, 9704977768
ReplyDelete