చంద్రశేఖరశతకము
(రచయిత తెలియదు)
1. శ్రీగురుపాదుకాద్వయము జిత్తమునందుఁ దలంచి యాత్మవి
ద్యాగమభోగ మోక్ష విభవాతిశయైకషశూర్మి మాలికా
త్యాగ వియోగ భాగ కవితావినతానన మూర్ఖహృద్భయా
భ్యాగతశూలమో యన నయంబునఁ జెప్పెదఁ జంద్రశేఖరా
2. కలుషమనోవికారులకుఁ గష్టులకున్ కుజనాళికిన్ కుత
ర్కులకును ధర్మశూన్యులకుఁ గుత్సితమానవకోతికిన్ మదాం
ధులకును సిగ్గువుట్ట మదిదూలఁగ నే రచియింతు నిన్ను ని
శ్చలమతిఁ జేర్చి యీశతకశాసన మిమ్ముగఁ జంద్రశేఖరా
3. "చాయడికాడ బాపనిపిసాసము పచ్చనిబియ్య మేసి దీ
ర్గాయు వటంటగూసె; యెను నంతినమేయము జారెనో! ఇనే
పోయినకన్ను వచ్చెనో! సమూలముగాఁ దలనొప్పి మానెనో!
ఏయెడ మేలుగాన" మని యేడ్చిను మూర్ఖుఁడు చంద్రశేఖరా
(చావడికాడ బాపనపిశాచము పచ్చనిబియ్యమేసి దీర్ఘాయువువంత అనికూసె, వెన్ను నంటిన మేహవ్యాధి జారెనో, విని పోయిన కన్ను వచ్చెనో, తలనొప్పి పూర్తిగా తగ్గెనో ఎక్కడా మేలుజరిగినది కనపడదు ..)
4. "సీ దగిడీకె బాపలపసిద్ది సరే! పొగనిప్పు కంట సో
మాదుగులింతికోయి, బతిమాలితి; మూడునెగళ్ళుమండు తై;
లేదని తిట్టె! పాపపుకలిగ్గెము! ఇంతపరాక! దాంట్లో దీ
రాదఁట!" యం ద్రసభ్యులు దురాత్ములు మూర్ఖులు చంద్రశేఖరా
(ఛీ దగిడికే బాపల ప్రసిద్ధి. పొగనిప్పుకోసం దోమయాలుల యింటికిపోయి బతిమాలితి, మూడు అగ్నికుండాలు (త్రేతాగ్నులు) మండుతున్నాయి. లేదని తొఇత్తాడు. దానిలోనిది యియ్యరాదంట ....)
5. "ఇస్తిని పొరసాని కటె ఈయూరిబాపల జందె మేసుకో
మిస్తి, కుకుండ నిస్తి, తిన నిస్తిని, బూమిలో బిచ్చ మెత్తుకో
నిస్తి, పరుండ నిస్తి, మన నిస్తి, ఇదేయ మనిత్తె మంట ఏ
మిస్తినొ ఇస్తి" నంచుఁ బలవించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఈ దేహ మనిత్య మని)
6. "ఓరు లలోసి బామ్మనుల మోలునొ! తండ్రి పరప్పతాప, నీ
పేరు ఉమాపతేన్రో! బవు పెద్దలు; పర్రెసతాని యెంగటా
శారుల సుట్ట మౌనొ! సరె జాడ తెలుస్తది! - అడ్డబొట్టు! నీ
పౌరుస మెల్ల బెట్టు" మని వాగును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(...ఎవరో తాళోసి బ్రాహ్మణులఁబోలునొ! .. పరప్రతాప .... పరేశావధాని (ఇంటిపేరు))
7. "అద్దమరేయి గోర్లరశినట్లు యసంగము వస్త దేందమే?
ఇద్దపురంగమో! ఇనఁగ ఈరుల సుద్దులొ! పంబనాదమో!
పొద్దన బాపనాంద్ల నెలి పొ మ్మని ఊ రెలగొట్టకుంటె నా
పద్దుకు దొడ్డమోస" మని వాగును మూర్ఖుఁడు చంద్రశేఖరా
( ... వ్యాసంగము)
8. "కూసుత వేమి? కుక్క నుసిగొల్పుదునా తలకిందు బాపఁడా?
మా సటవత్తరంట పలుమా రొదిరే వది నీ సబావమా?
దాసరి కోస్తి పొద్దనిత దప్పికి తోసినయట్ల; వట్టి యి
శ్శాసములేనిబాపఁ" డని సణ్గును మూర్ఖుడు చంద్రశేఖరా
(... మహాశతవృద్ధిరంట ... ప్రొద్దున(ఉదయమున) నే
9. "కూసుట లేమి యీదిఁబడి! కుప్పటగంతులడేమి! నామముల్
బూసుట లేమి! నెత్తి నొకబు ట్టదియేమి! శిరంగ మేమి శీ
దాసరికొయ్య! నిన్నుగని దద్దిరపోతిని! మొన్నమట్టి ఈ
యేసము లేమి ని" కని సడింతురు మూర్ఖులు చంద్రశేఖరా
10. "పేలుత వేమి కాలకడ పెద్దబెరమ్మల మంత? కండ్లు పో
తఒలె! పదేండ్లకింద నొకతయ్యెడు కీలసగడ్డ మొణ్ణి మో
సే లిటుజేస్తి; వాశరము కెక్కడిబద్దము? కూసినక్కగ
య్యాలిది; - తిట్టిపోయె" నని యాడును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ప్రేలుత వేమి కాళ్ళకడ పెద్దబ్రాహ్మణులము అని? ... కూసిన అక్క(ఆమె) గయ్యాళిది)
11. " ఆరెదులంట!- మోపురుదరాచ్చలు, వూపిది వంట, నొష్టబల్
గోరెడుసుక్క - వాగొడున కూకొని రెప్పలు మూసి గొన్గుతా
డూరికె తిత్తిలోన శెయి దూర్సుక! అక్కడ లేవ డొట్టియౌ
గోరపువాలకం" బనుచుఁ గూయును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఆరాధ్యులంట! మోపెడు రుద్రాక్షలు, విభూది వంటన్ ..... వాగువొడ్డున .... వట్టియఘోరపువాలకము ... )
12. "బుడుపులకట్టె, ఒంట యెలిబుడిదె, సేవలగుండ్ల పేరు, వో
లొడు, గొకకాయగుడ్డ - గని లోకులు నీమొగముమీదవూయ - సీ
కడసెడి జంగమోడికొడకా, ఎల గెంటుదు! నంతకాని, నీ
ముడు సిర గేతునా" యనుచు మోదును మూర్ఖుఁడు చంద్రశేఖరా
( ... ఒక లొడుగుఁ=బొంతచొక్కాయ, కావిగుడ్డ, ... నీమొగము మీద ఉమ్మివేయ, ఛీకడచెడిన .... వెళ్ళగెంటుదును, ... నీముడుసు(=ముడ్డీపూస) విరగవేయుదునా? ..)
13. "మొనగలకఱ్ఱ సంక, శిలిముంత, కాసాయపుపాత - మొద్దులా
గున నవుదూతలంట! యిని గుంతను మెట్ట! తెలార లేశి నా
కనులతొ సూస్తి పాపపు శికండిని! బోడిపిసాసి! నెట్ల ఈ
దిన? మిఁక మంచిగా" దనుచుఁ దిట్టును మూర్ఖులు చంద్రశేఖరా
(... చిల్లిముంత, కాషాయపుపాత .. అవధూతలంట! వీనిని గుంట(గోతిలో) ను బెట్ట!)
14. "తా లటు! కూస్త వేమి అయతద్దినమెల్లుడి యంట? మొన్నపై
టాలను బాప లిద్దరికి డ బ్బొక్క టి చ్చొకదండ మెట్టితే
ఏలర బాపనాడ తెగనీల్గుత వేమి? యిసారి కూస్తె నీ
కా లిరగేతు సూడు" మను కాపురుషుం డిల మూర్ఖుఁడు చంద్రశేఖరా
(తాళూ(ఆగు) అట్లా కూస్తావేమి?...)
15. "ఈసరబోట్ల యాగెతము! ఏకసినా డలరేవులోన ఏ
మాసొ! తనాలకాడ బిగమట్టెను దారొయ మంట! ఎంతనే
మాసక తయ్యె డోసె; తడిమాతనే నొకతయుయెడోసితి; నా
యీసకబాపనాడి" కని యెంచును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఈశ్వరభొట్ల అఘాయత్తము! ఏకాదశినాడు ... ఏమాశయో స్నానాలకాడ ధరపోయమని బిగబట్టెను. వెంతనే మాచక్క (అనునామె) తవ్వెడు బోసె ..)
16. "యము డొలె వచ్చి గుర్లట!- తయారుగకూకొనిపంచసంసకా
రములట! పూట్న మంటొక సళాకున గాల్చెబుజాలమీద; యే
సము! లొకరూక దెమ్మని పసంగము సేసెను; మల్లికూస్తె నా
మము దుడిసేతు నంటి" నను మత్తుడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(యమునివలె వచ్చి గురువులట తయారుగా కూర్చొని పంచసంస్కారము (చక్రంకితము) లఁట! .. ఒక సళాకున(ఇనుపకాడతో) బుజాలమీద గాల్చె! ఏమి యతని వేషములు! ఒక రూక (సంభావన) తెమ్మని ప్రసంగముచేసె. మళ్ళీకూస్తే నామము తుడిచేస్తానంటి ...)
17. "పాడి పినాసి బాపడు సుబంబలె పెండ్లికి సావుదాన మం
టా; డదె బెమ్మముడ్డి లొకడ బ్బి పిసూసుక కొంక మంట కూ
స్తా డినరాని కూతలు! తదాస్తు లటం టని వాగు బాపనాం
డ్లేడక యేస మైరొ!" యని యేడ్చును మూర్ఖుడు చంద్రశేఖరా
(...సావధానా అంటాడు. అదె బ్రహ్మముడిలో ఒక డబ్బువిప్పి చూచి
కుంకుమ అంట కూస్తాడు వినరాని ....)
18. "పొద్దన యింతగా మయిపపుత్తురు డంట దియించి అబ్బకున్
తద్దిన మంట! మాపొగుడూతా డదె బాపడు సైలకారిపె
ద్దెద్దొలె బట్ట సర్సుకొను! ఏందో మ రొక్కటి వాగుతాడు ఏ
సుద్దము బద్ద మేడ" దని సొడ్డిడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ప్రొద్దున .. మహిపపుత్రుడ అంత దీవించి ... సైలకారిపెద్ద ఎద్దువలె బట్ట సరుదుకొని ....)
19. "తడవుల కింద యాత్తరొయి తానాలకాడను తిర్పతెంకటే
సుడి పుసుకారె నంట! - ఒక సోద్దెము సెప్పుత: సోబనాలయెం
బడి మడి నూకుతారు శెడుబాపలు దచ్చన లంట సేతులో
ఇడు ఇడు మంత సాస్తా" రని యేడ్చును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(=చాలాకాలము క్రిందట) యాత్రపోయి స్నానాలకాడ తిరుపతి వెంకటేశ్వరుని పుష్కరిణి అంట .. (అక్కడ జరిగిన) ఒక చోద్యము చెప్పుతాను- సోపానముల వెంబడి బడి ..)
20. "శరదగ యింటి నే పరమశాసతురాలిరతంబు; మూడుసం
చరముల మట్టి శాస్తురులు సక్కనగా తెలసెప్పె, మెచ్చి ని
బ్బరముగ నిస్తి ఓతులము పత్తొక దోతులసాపు కంట; మే
లెరగని జల్మ మేల?" అని యెంచును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(శ్రద్ధగా వింటిని పరమశాశ్వతురాకి వ్రతంబు - మూడుసంవత్సరముల బట్టి ...తెలియ చెప్పె. ... ఒక తులము పత్తి ఒక ధొవతుల చాపున కని ...)
21. "పలసనిపుల్సు పప్పు నెయి పాశము పచ్చడి మేలుపిండివం
టలు తెగబెట్టె పట్ట మని నారెనబొట్లయబార్రె; ఇంత మా
యెలుపుగ సేసి ఒక్కతున కిస్తదిపో! నెల కేడుతద్దినా
లలవడీ వారు బాగుడలె" నందురు మూర్ఖులు చంద్రశేఖరా
(పలచని పులుసు, పప్పు నెయ్యి, పాయసము, పచ్చడి, మేలైన పిండివంటలతో పట్టమని తెగబెట్టె నారాయణభొట్లయ్య భార్య. ఇంత మహావెడలుపుగచేసి ఒక్కతునక ఇస్తుంది. నెలకి ఏడుతద్దినాలతో వారు బాగుగ నుండవలెను ...)
22. " గంటము పేర యింటను భగాతము సెప్పితె ఈదిలోకి ఫ్
రం టెలి సూస్తి నేను. ఇను; రేత్రి రమాండెము బాగ సెప్పె! మా
యింటి; దురోదనుండు బవుయిద్ద! మిబీసను శించి లంకలో
మం టెలిగించి వచ్చె" నను మాంద్యుఁడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(..గంటముపేరయ్య (అనువాని) ఇంటిలో భాగవతము (పురాణము) చెప్పితే వీధిలోకి ఎవ్వరా(ఈచెప్పునది) అంటవెళ్ళిచూస్తి.; రామాయణము బాగా చెప్పె; మహావింటిని - దుర్యోధనుని బహుయుద్ధము. (ఆదుర్యోధనుఁడు) విభీషణుని చించి లంకలో మంట వెలిగించె .. అని కధాసరళి.)
23. "కొందరు బాపనాండ్లు బరెగొడ్లలె సెర్మమడెడ్డి సూసి తే
మందల వొండునీలు కసుమాలము సేసిరి యీడ తానమా
డందరు; యీండ్లసందె జప మౌపస నంతని చెప్పుతారు యీ
రెందుల కెక్క" రంచు పలవించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
24. "పెద్దలు శెప్ప గింటి; బవుపె ద్దట! యెగ్గెసొమాదులంట! బల్
గద్దరి! కోడెయాటలను కంబుకాడ మరుండ మెట్టి యా
డిద్దరు లోన ఓమ మట ఏకముగా రొదపెట్టి బాపనా
డ్లెద్దులమోలెతిందు" రని యెన్నును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(పెద్దలు చెప్పగా వింటి బహుపెద్ద యట. యజ్ఞసోమయాజులట! బల్ గద్దఱి (=బలుదిట్టామైనవాడు) ... (వయసుపొటేండ్లను యూప) స్తంభముకాడ పరుండబెట్టి అక్కడ ఇద్దరులోన (=లోపల) హోమమట ...)
25. "రెడ్డి, డభోల్ డభోల్ హరిహరీయనిసూపుతమాసలౌర! మా
దొడ్డుగ ఆన్నె కూకునరు దొర్లదె! యాన్నే' యటంటనాడె మా
మెడ్డుగ! దొమ్మ రెక్కగను మించినయిద్దె మరేడ లేదు! నా
తెడ్డొకబాప నిద్దె" లని తిట్టును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(దొమ్మరివాని మాటలు: రెడ్డి డభోల్ డభోల్ .. చూపు తమాషాలు ఔరా మహాదొడ్డగా ఆడనె కూకున్నారు దొరలు - అదె ఆడనె..)
26. సీతని యెంకిపేర్బలి మిసేసముగా యిడ సూపి రేపు క
న్నేతులసందు మూతరము నీగుగ బాగుడ దంట మొన్నపు
ర్రోతుడు సెప్పె లగ్గము కిరోదము వొక్కటి; బాపనాండ్లు మా
సేతులు సాస్త" రంటని వచించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(సీతని యొక్కయు వెంకియొక్కయు పేరుబలములు (జ్యోతిషము) విశేషముగా ఈడ(=ఇక్కడ) చూచి రేపుకన్యాతుల (నక్షత్రములు) సంధిలో ముహూర్తము .. బాగుండ దంట మొన్న పురోహితుడు చెప్పె - లగ్నమునకు విరోధ మొక్కటి... మహాచేతులు చాస్తారు (దక్షిణలకై) ...)
27. " ఊరికి శాయిబాటు మనౌత్తరపీదిని బాగసెప్పె; శీ
కూరమ మంట! బాప డిడ కూకొని యేలిడి లెక్క సూసి గా
శారము సెప్పె; పున్నె మని సక్కగ బోరిగి లేసి పోస్తి నా
శారెడు వొ" ణ్ణేటంచు వెసఁజాటును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(....శ్రీకూర్మమంట ఒక బాపడు ఈడ కూకొని వ్రేలిడి వ్రేలు వెట్టి ... గ్రహచారము చెప్పె .. బోరల వేసి నాచేరెడు ఒడినిండపోస్తిని ..)
28. " సెప్పితె పెగ్గె; నేను తొలి సేసిన పున్నెము! కుండ లంటితే
తప్పు సలేద్రలోన; శనతాగితి సత్రపుబాపనాడు నా
దొప్పెడు బోసినాడు; ఇను, దోసము లే దట! పుల్లనీల దో
శప్పము లచ్చమే" మనుచుఁ జాటును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(.... పుల్లనీళ్ళదోసె(అట్టు) అప్పము లక్ష్యమేమి?)
29. "రాతిరి శెప్పె గాడదపురాందములోని శరండ మెత్తి మా
యీతముగానె బాపడు; పెదింతది పుస్తక మంట గట్టిదో
సూతరగంటు; ముప్పిరిన సొప్పడి యేసితె మూడుబార్లపై
సేతెడు పగ్గ మౌ" ననుచుఁ జెప్పును మూర్ఖుఁడు చంద్రశేఖరా
30. "గొబ్బునవచ్చి కూకొని సిగోమమటంటను, యెగ్గె మంట! నీ
కబ్బురమా పెదెంకి, ఇది యత్తముగాదు, నిరత్తకంబుగా
దబ్బున గొర్లమట్టుకొని దాం దెతి సూడక కోస్త; రొట్టిత
బ్బిబ్బులసోమయాతు" లని ప్రేలును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(...'శివోహ" మ్మటంతను, యజ్ఞమంట (ఇది) నీకు అబ్బురమా? పెద్దవెంకీ ఇది అర్థముగాదు. నిరర్థకంబుగా దబ్బు 9తటాల)న గొఱ్ఱెలను పట్టుకొని దానిది ఎత్తిచూడక కోస్తారు - వట్టి తబ్బిబ్బుల సోమయాజులు ..)
31. "వాగకు! - మొన్నకూతురీవాగము కొస్తివి సోలెడిస్తి; నీ
రోగమొ నీ వుమాద,ఒ ఇరుద్దము! లాసనబేద మంట! ఈ
లాగున మళ్ళి వస్తివి బళాబళ! సేతడి యారలే; దిదే
మాగడ మంకుబొట్లు పద" మందురు మూర్ఖులు చంద్రశేఖరా
(... విరుద్ధములు ఆశ్రమభేద మంట .. చేయి తడియారలేదు ఇదేమి యాగడము అంకుభట్లూ పద (నడు-వెళ్ళిపో) ...)
32. "కొద్దిది సంకపస్తకము గోతరకండమొ! బాగతంబొ! ఈ
మద్దెను పేరిశాత్రులు తమాసగ కోయిల లాలకించ మా
ముద్దుగ సెప్పె! అంతకన మొగ్గుగ బైనిడికొండ డెల్లబల్
సుద్దులు సెప్పగింటి" నని సొక్కును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(చంకలోని పుస్తకము కొద్దిది (అది) గోత్రఖందమొ, భాగవతమొ! ... అంతకన్న మొగ్గుగ బైనీడికొండదు ఎల్ల(అంతయు) సుద్దులు చెప్పగ వింతిని...)
33. "మొన్నటి ముళ్ళకట్టె, పదమూడుదినాలు తనాలు సేసి యౌ
తిన్నగ బాబు పేర్నొడివి, తిమ్మనబొట్లకు, - పంబకాంద్ల యెం
కన్నకు చెండి కెంకనికి, - కమ్మనికి సెంబెడుపాలు పప్పు నెయ్
సన్నపు బియ్య, మిస్తి" నని సాటును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఔ పదమూడు దినాలు స్నానాలు చేసి ... తిమ్మనభొట్లకు మొన్నటిముళ్ళకట్టె నున్ను, .... బియ్యమున్ను ఇస్తిని ...)
34. "నన్ను సదించె బాబు శిననాడు తమాసగ బాగతంబు రా
మాన్నెము బారతంబును తమామును; కిందియి ముందె వచ్చు; నే
నిన్ని సదుందగానె బవు యెత్తము; వో రిక బాపనాండ్లు నా
కన్నను లొ" జ్జటండ్రు పలుగాకులు మూర్ఖుఁలు చంద్రశేఖరా
35. "సాలగ పస్తుతించి బవు సంపదదాముల నెంచుతావు, ప
ద్దేలకు యెన్కతీయవుర, దేన్నొ అరుస్తవు బట్ట నంత! నీ
లాలన సాలు! యేముటది? లచ్చలు నీయటివారు బూమిలో;
సీ లెగి సెల్లు పొ" మ్మని వచించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(చాలగ ప్రస్తుతించి బహుస<పద్ధాములని ఎంచుతావు. పద్యములకు వెనుకు దీయవుర దేనినో (గూర్చి) అరుస్తావు - భట్టును అంటూ?)
36. "చందము రుత్తలచ్చనము జాతులు వీరతి శక్రమాల్లు లా
సందులు దోస మచ్చులొడసారము సూసి కయీసు నైతి; ఇం
పొందగ తిమ్మరాజుకత పూర్ణముగా వచనంబు సేస్తి; ఇ
ట్లందరు సెప్పనేర" రని యందురు మూర్ఖులు చంద్రశేఖరా
(.....విరతి(యతి), చక్రము హల్లులు, ఆసంధులు, దోషము, అచ్చులు, ఒడసారము(=పూర్తిగా) చూచి కవీశ్వరుడనైతిని)
37. "మూరెడు పెద్దపస్తకము ముందరగానె సదించి, యెన్క కా
కారగుణింత మోనమలు గట్టిగ సెప్పలె తల్లకిందు; నీ
శారదమా ఇదేంది? ఇక సాలిచు! మొన్నటిమట్టి అచ్చరా
లూరక నేలపా" లనును నూరక మూర్ఖుఁడు చంద్రశేఖరా
(.... కకారగుణింతము, ఒ న మలు...)
38. "ఇంటిని తిమ్మరాజుకత, ఇంటిని యీర్లకతాపసంగముల్
ఇంటిని పాండురాలియిబ, మింతిని నాయకురాలిశౌర్రె ,ఎ
ప్ప<టికి సందివాక్కెముల పాడుచెరిత్రిన నాకు బాగ్గె మె
న్నంటికిగల్గునో" యను నవజ్ఞుఁడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(... వీరుల కథా ప్రసంగముల్, .... పాండురాలి (పాందవులభార్య;పాంచాలి) విభవము, .... సంధివాక్యములంబాడుచరిత్ర వినన్ నాకు భాగ్యము ఎన్నంటికి? ...)
39. "సమ్మగ సెప్పె మారుసులజల్మముల; న్నిక సెప్పు తింటవా?
బెమ్మకు సిబ్బి, యీతని కిబీసుడు, వాడికి బల్లి, వాడి కో
కొమ్మరసామి, ఈతనికి కొండోలె బీముడు, కచ్చపుండు -- మా
నెమ్మిగ బుట్టి" రంచు వచియించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(మహాఋషుల జన్మములను ఇక చెప్పుతా వింటావా? బ్రహ్మకు (పుట్టినది) శిబి, ఈతనికి (శిబికి) ఇబీసడు(విభీషణుడు), వాడి(ఆవిభీషణుని) కి బలి, వాని (ఆబలి) కొక కుమారస్వామి, ఈతని(ఈకుమారస్వామి)కి కొండవలె భీముడు కచ్ఛపుడు; మహా నెమ్మిగ ....)
40. "మా కిన సెప్పె నోకత; శిమండనారయిడికాడిశెంచు నా
పీకమలాన బుట్టె నలుబిడ్డ; లొ కిద్దరు ముంగ, లాది బ
మ్మాకడసారి అంతకు శిమండనరాయిడి యాడుమడ్డియా
సో కలిగింది చెప్పు?" మను సొక్కుచు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(మాకు వినఁ జెప్పె నొకకత శ్రీమన్నారాయణుని కడనున్న చెంచు(యొక్క) నాభీకమలాన నలిబిడ్డలు (పుట్టిన) (అందులో) ఒక ఇద్దరు ముంగల (ముందుభాగమునను) ఆదిబ్రహ్మ ఆకడసారి ....)
41. "బాపడు వేశదేయ మట! ప స్తట! దేము డెమేద్దె మంట! సీ
రే పుసుకారె, బాపడ, సరే నరమేన సమస్తబాగ్గె మే
యేపుకు సావులేక మరి యేమిటి నీమొగ ముండ దాడ! నే
శేపిన యిన్గలే" ననుచుఁజెప్పును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(... వైశ్వేదేవ మట ... దేవునునైవేద్య మట! ... నీముఖము ఉన్నదా ఆడ(అక్కడ)! నే చెప్పినను వినగలేవు ...)
42. "పండినఛెను నాది పడ బట్టుకపో, నెలనాడు నీవు పు
ర్రాండము శెప్పి నావుగద రమ్మెముగా! బగుమాన మిస్త; మా
ముండ యినాల నంట పడి మొత్తుక సస్తది; నీవు మల్లి రా
మాండము సెప్ప" లంచు నను మందుఁడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
43. "సోమడిశేయి లాబ; మది సోమిత లెందుకు? కోరు జల్లితే
బూమిలొ యాడలేదు పడుమొక్కలు; ఇంటినిండ గ
డ్డాములు గూడ బండె; డియి దాపను శె య్యిరి గుండ దంట!
వే మొకసోలె డిస్త నడి సె" ల్లను మూర్ఖుఁడు చంద్రశేఖరా
(... ఇంటినిండ గడ్డివాములు ... ఇవిదాపను చెయ్యి విరిగిఉన్నదంటావు. ఏమో ఒకసోలెడు ఇస్తాను నడిచివెళ్ళు అనును ...)
44. "బాపడు మంచివోడె అని బత్తిగ నే నటి శేనికాడ నా
కాపరమేశు డిచ్చినది కంచెడు కంకులు వొణ్ణిమోస్తి; సీ
పాపలమారికొయ్య! నిను బామడు సూసితే తన్నుతాడు; నీ
కాపుకు సిగ్గు లే" దనును కాపురుషుండిల చంద్రశేఖరా
45. "ఏసము లెయ్యమోకు మనయేపరియీరయ శెయ్యిసూచి మా
కాసలు యెల్ల మెట్టె! మన కాస యిదేటొ తెలార్నెదాక! సీ
కాసుకు ఆసలేదు; మరి కర్రిరిసేస్తను; దొడ్డికాడ పా
రేసిన ఆయువుంటె బతికే" మను మూర్ఖుఁడు చంద్రశేఖరా
(వేషము వెయ్యబోకు, మన వ్యాపారి వీరయ్య చెయ్యిచూచి మా కాశలు వెళ్ళబెట్టె; మనకు ఆశ ఇదేమిటో తెల్లవారినదాక! ... కఱ్ఱ విరిచి వేస్తాను(=కొట్టుదును)
46. "దుస్తుకు శేసి మొన్న తెగదొయ్యగ రాముడు పన్ను ఇచ్చె;
శిస్తుకు రూకలంట బలు శీదరపెట్టిన ఇయ్యజాలవా?
శేస్తవు కాపరం బిగను! శేతికి బొం డొక టేశి నిన్ను తో
శేస్తను కొట్టులో" ననుచుఁ జెప్పును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(.....చేతికి బొండ(బందకొయ్య;అరదండము; కఱ్ఱబేడి) ఒకటి వేసి నిన్ను కొట్టు(ఖైది) లో తోసివేస్తాను)
47. "వంటకు కట్టె లిస్తి, మరి బత్తుడవా నిను బొందమెట్ట, నా
గంటికి కొయ్య సూడు మని గంగని తిప్పితి మొన్నమట్టి! నా
శంటము ఏమిశేస్తివిర? శప్పర! కాలిరగేతు సూడు! ఈ
కుం టిగ సావదన్దు" నని కూయును ముర్ఖుఁడు చంద్రశేఖరా
(... బత్తుడవా(వడ్రబత్తుఁడవా? వడ్రంగివా?) నిను బొందలో బెట్టా! నాగేటి(నాగలికి) ....ఇయ్యకుంటే ఇక చావదన్నుదును!)
48. "తిమ్మడీవొల్లు సూస్తె సలితాపము లంట! ఇదేటి రోగమో!
తమ్ముడు ఊరలేడు; తమదాసరికూడు కులాన లేదు! సీ
కమ్మకులాని కిట్ల కడగండ్లు మరుండవు! తేనె వస్తె నే
నమ్మను, అప్పు లీయ" నని యందురు మూర్ఖులు చంద్రశేఖరా
49. " బాపడు లగ్గ మంట తెగబారెడు పస్తక మిప్పి సూసి, యే
ల్లేపి తమాస సూడు, మిదె లింగడిపేరుబలాన చల్లు మం
టాపతిపెట్టెనాకు! కొరగానికులం బిది నమ్మరాదు; ఓ
గాపెడుగింజ లైన మరి గా" వను మూర్ఖుఁడు చంద్రశేఖరా
(.... వ్రేలు లేపి తమాషచూడుము ... ఇదే లింగని పేరు బలమున (గింజలు) చల్లుము అంట ఆపద పెట్టెనాకు)
50. గుడగుడ రోజురోజు సదుకుంటడు బాపడు, పిచ్చిగుంట్ల నూ
కడు శెప్పినన్ని గోతరలు గట్టిగ శెప్పునొ! మీసమంగుగా
వడిగొని - సవ్వసాచి! తలపట్టక శిందుపదాలు పాడునో!
గుడగుడె! వట్టీలొట్ట" యని కూయును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(రోజు రోజూ గుడగుడ చదువుకుంటాడుగదా(ఈ)బాపడు! - పిచ్చిగుంట్ల సూకకడు (పేరు) చెప్పినన్నిగోత్రములు గట్టిగ చెప్పునా? (ఆపిచ్చికుంట్లనూకనివలె)
మీసము హంగుగా బడవేసి సవ్యసాచి తలపట్టుకొని చిందు(ఆట) పదాలు పాడునా? ఈ బాపలది గుడుగుడే(గాని) వట్టిలొట్ట(వట్టిలొటారము; డొల్ల)
51. "సిద్దన నిన్న టేకున అసిద్దముకొమ్మనసేరి మేకతో,
ల, ద్దొకబోలె డెల్మిడి మొగా, నొక బోలెడు రుద్దరాచ్చ, ల
ట్లొద్గ్యినేసి ముక్కనిసి గొన్గె! నదేమి రకాసొ! దయ్యమో!
మొద్దొ! పిసాసొ! గామొ!' అను మూర్ఖుఁడు చంద్రశేఖరా
(సిద్ధన(అనుజంగము) నిన్నటివేకువను అశ్వత్థము (రావిచెట్టు) కొమ్మమీదచేరి, మేకతోలు, అద్ద, ఒకబోలెడు వెల్మిడి(బూడిద) మొగాన, ఒక బోలెడు రుద్రాక్షలు, అట్ల(=ఆరీతిగా) ఒద్దెయి(=పెద్దవి) వేసి ముక్కు అణఁచి గొణిఁగెను - అదేమి రాకాసియో, దెయ్యమో ........ గ్రహమో...)
52. ఆరు పదేనులై నలుపయారు, పదారొకమాడ సౌల, మిం
కారెడు మూడు పద్దు లయి గల్పితె డబ్బయె; కర్నమంట! నే
నేరనొ! సెల్లు యేస్తనని నీల్గు వేమిటి! శౌ లొడేతు! నీ
మోర ఇ దేందిలెక్క?" యని మూల్గును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఆరుపదింహేనులు ఐ నలభైయారు పదహారు ఒకమాడ చౌలము - ఇంకా రెండు మూడు పద్దులు ఐ కలిపితే డబ్బయినది (లెక్క) ... చెవులు ఒడియ వేతునా(=నునులుముదునా)?)
53. " సెప్పుకోరాదు,- కోడలు నిసేకము సేసుత దంట! దీని బు
ద్దెప్పటి కింతె! రెండుతల లేర్పడి ముంతెడు నీలు మీద ప
డ్డప్పటి కంట సెప్పు తిన నంతది! ' యెప్పటియేడు కప్పుడే
ఇప్పడెకాని ' మంట" దని యెంచును ముఋఖుఁడు చంద్రశేఖరా
( .... ఎప్పటివేడుక అప్పుడే (కాబట్టి) ఇప్పుడే(నిషేకము) కానీ మంటుంది)
54. " ఏసము లేమి! సందెడు తలెంటిక లేమి! ఇయొంటిబూడిదే!
మానసలేమి! లేశి ఇటికావముకాడ కుకుండురోరి నా
దోసెడురాగు లోస్త, మరి దొడ్డయొగీసుడ వైతె ఇప్పుడే
వాసిగ ఊరికెల్లు" మని వాగును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(... ఈయొంటికి(దేహమునకు) బూడిద యేమి! ఆసనాలేమి! లేచి ఇటుకఆవము.... మరిదొడ్డ యోగీశ్వరుడ వైతే ...)
55. "ఊరికిబూసనమ్మట పెద్దోరికి లేనిగునం! చరే సదూ
కూరికె! సర్పవత్తి, యిపు డొకటి శెప్పర! పూరిదక్క; దా
పూరణ మంటిశేను నిరమూలముసే సిక నాట యేస్తడం
టీరముమాల్నికొయ్య" యని యెన్నును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(పెద్దవారికి లేనిగుణము ఊరికి భూషణ మ్మట. సరే చదవకు ఊరికే (ఓ)
సత్ప్రవర్తి -(సంబుద్ధి) ఇపుడొకటి చెప్పరా- పూరి (గడ్డి) దక్కదు; పూర్ణము వంటి చేను నిర్మూలనముచేసి ఇక నాట(విత్తనమునాట) వేస్తాడంట వివరముమాలిన కొయ్య ..)
56. "తిరలికడబ్బుదొబ్బి బవుతెంపుగ సాలెకులాని కిందు, దొ
మ్మరలకు యాటబత్తె, మొకమానెడు బాపనబూరి, మేలుకొ
త్తరకముసీరె బోగముమదారికి, వీరడియప్పపెండ్లి పె
ద్దరికముగానె సేస్తి" నను దబ్బరి, మూర్ఖుఁడు చంద్రశేఖరా
((తిరువళిక(దీపము-గరుడగంబము) లోని తింపెపు కాసులు ఎత్తుకొని బహుతెంపుగా: సాలెకులానికి విందు, దొమ్మర్లకు యాట(పొటేలు) బత్తె, మొక మానెడు బాపలకు భూరిదక్షిణ ...)
57. "ఇంతగ ఒంటి దీలకు మనింటిది సేసినవైభగంబు నే
నెంతని సెప్ప! సూసినోరు ఏలెటు కాశిరపోయిరంట! నే
ముంతెడు నీలలోన ఒకముద్దపడే సిరుగారికెల్ల సా
ల్నెంతపరామరిస్తి" నని యాడును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఇంతగా ఒంటిది(ఒక్కత్తయే) ఈలకు(వీళ్ళకు) మన ఇంటిది (పెండ్లాము) .. వైభవంబు .. చూచినవారు (ముక్కుమీద) వ్రేలుపెట్టుకొని ఆశ్చర్యపోయిరట. నేను ముంతెడు నీళ్ళలోన ఒక (సంకటి) ముద్దపడవేసి ఇరుగు(ఇంటిప్రక్క) వారి కెల్ల చాలినంత పరామర్శిస్తిని...)
58. "గుడియెనకాల ఇగ్గెనము గు డ్లెనమెట్టుక తోక సాసి దో
సెడువోయమంట వగ్గుతడు చేతు; -లదేందది ఇంటివా? ఇనా
క్కుడికొడు కాయిబీసనుడికూతురు కూనల యెంగటమ్మ అ
ల్లుడు తగసూడు" మండ్రు ధరలోపల మూర్ఖులు చంద్రశేఖరా
(గుడివెనుకల (నుండు) విగ్రహము గ్రుడ్లు వెళ్ళబెట్టుకొని, తోకచాచి దోసెడు పోయ మని ఒగ్గుతాడుచేతులు. అదేంది అది వింటివా? వినాయకుని కొడుకు, ఆవిభీషణుని కోడలగు కూనల వెంకటమ్మ అల్లుడు)
59. "అంచన లేవదీసి యిరి కైనటిపుట్లకు బాడి గెచ్చరా
యించి శిపాయిబత్తెముల కెన్నున బండొక టెత్తి కొట్టి నూ
కించుదు, మాన్యగాండ్ల పడగెంటుదు, పాదనపాండ్ల నూరిలో
కొంచుదు, - నా పబుత్వ" మని గొన్గును మూర్ఖుఁడు చంద్రశేఖరా
60. "గంగడు, దొంగముత్తి పలుగాకి; పెదేగిసబామచూడ; గో
సంగి పిసాసిబిడ్డ బలిసావుసురాలు, పినాళ్ళతల్లి మా
బంగుడు తొత్తు; యింటగలపత్తతి ఇఱ్ఱెరశీరదప్ప, నా
సంగతి యింటివా? అను నసారుఁడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
61. "పానము సమ్మ గుండె నట పాడుత ఆడుత దొమ్మరక్కి న
న్నానికసేసి యెక్కినపు; డబ్బుర! మేదొకసీరె, యాట, బ
త్తేనికి మాడ ఇస్తి, నది తీరుపసంసకమంట గూస్త డీ
పీనిగ బాపనా" డనుచుఁ బ్రేలును ముర్ఖుఁడు చంద్రశేఖరా
(ప్రానమునమ్మగ(=సుఖముగా) ఉండె నచట పాడుచు, ఆడుచు దొమ్మర అక్కి(పేరు) నన్ను ఆనికచేసి(=ఊతముచేసికొని)(గడ) ఎక్కినప్పుడు అబ్బురము! ఏదో ఒకచీరయు, యాడు(గొఱ్ఱెపోతు)ను, భత్యమునకు మాడయు ... అది తీరు ప్రశంసకము అని కూస్తాడు ఈపీనిగ ...)
62. "మాడకు వంగ మంట పదిమాతర లిచ్చె; పెవాతపిత్తమం
టా డొలు సూసి! ముత్తిక! మానడికి తాగుడు మద్దె; మాడియి
ల్లూడిశిపెట్టె వైదుడు! నగిస్తది! రెండొవలాలు సూశి వో
మాదను దెమ్మటా" డనును మందుఁడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(మాడ(=నాణెవిశేషణాము)కు వంగ(భస్మము) అంట పదిమాత్రలు ఇచ్చె. ప్రవాతపిత్త మంటాడు ఒళ్ళుచూచి! మృత్తిక(+మంటిగడ్డ); మనవాడికి త్రాగుడు మధ్యమము(=మట్టు); వాని (ఆరోగియొక్క) ఇల్లు ఊడ్చి పెట్టెను వైద్యుడు. నవ్వు వస్తుంది. రెండవకాలిని జూచి ఒకమాడను తెమ్మంటాడు వైద్యుడు.)
63. "దస్తుగ మొన్ననే బురళదాసళచేత గడించి నాట్టె మా
డిస్తిని చంగమొద్ద; తెలెడేస్తి నెయోస్తి, సమస్తబాగ్గె మే
డిస్తిని; వాండ్ల కయ్యెతలె; డేకనె జాండ్లకు సోల దారవో
యిస్తి యిసారి తేర" కని యెంచును ముర్ఖుఁడు చంద్రశేఖరా
(... సంగము(గ్రమము పేరు) వద్ద; తెలెడువేస్తి(=కంచమంత) ... నెయ్యి పోస్తి... వాండ్లకు తెలె డయ్యెను. వేకువనే జాండ్రల(కులము) వారికి ... ఈసారి తేరకు ...)
64. "సెట్టికి కోటిలాబములు! సీమకయీస్రులెకాని పద్దెముల్
గట్టరు; పెండ్లికూతు రొకగట్టిది; శా లదె, అయ్య సద్దుకుం
టట్టె మబాగ వుంత దిక యాల సునామడి? పెండ్లినాటికో
గొట్టము చేతికిస్త" నని కూయును ముర్ఖుఁడు చంద్రశేఖరా
(....సీమకవీశ్వరులే కానిపద్యములు కట్ట(జాల)రు. శాలువ అదె అయ్య సరుదు(=సవరించు)కుంటే అట్టే మహాబాగ ఉంటుంది. ఇక యేటికి సునామణి(=వినిపించుట)?)
65. "కుక్కలదొడ్డి కాపురము, కోతులదాపర మూ, రుగాది నా
డక్కిరతమ్ము శేస్తి గురు డయ్యని, పున్నెము దారవోసె; నే
డెక్కడ తెత్తు; దయ్యమలె నేతికి వస్తి" వటంచు లేశి దా
కుక్కను మీదికట్టె నుసుగొల్పును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(...ఊరు ఉగాదినాడును ఆక్రితమ్మును గురులయ్యను (పూజ) చేస్తిని ....)
66. ఇంటికిలేనివాజ మనయీరడు పెత్తన మేడ్చి గామమా
మంటను గల్పె! రాశి కొక మానెడు, ఇంటికి డబ్బు గూర్చి యే
యింటికి పంచిపెట్టె! కులయీనుడు! మాతలు నేర! డింకయే
మంటవు యిల్లు గుల్లపడె" నందురు మూర్ఖులు చంద్రశేఖరా
(ఇంటికిలేని అలవాటు.... గ్రామమునా మంటగలిపె. మొత్తముగా ఒక మానెడు (గింజలు)న్ను. ఇంటింటికి డబ్బు చొప్పున కూర్చివేయింటి (వెయ్యిమంది)కి... కులహీనుడు! ..)
67. "పట్టపదేండ్లనుండి బవుపద్దెము లల్లితి; వీనుతావు; యే
మెట్టను లేదు నీవు బగుమేలుగ యేసము లేసినావు? బా
గ్గట్టుక మోస్కపో పిడికె డారికె లిస్త! గరించు మాట, ఇ
ట్టట్టు ఇసార మొ"ద్దనుచు నందురు మూర్ఖులు చంద్రశేఖరా
(...... బహుపద్యము లల్లితి వింటావా? ఎక్కడనూ లేదు- నీవు బహుమేలుగా వేషము లేసినావు. బాగుగా కట్టుకొని మోసుకొనిపో - పిడికె అరిక(అరిక-ధాన్యము) లిస్తాను. గ్రహించుమాట. ఇట్లట్లు విచారము వద్దు ... )
68. "ఆరడివొద్దు! మీరుగురులయ్యలు! యీతము సెప్పుతా! పెద
మ్మారికి కోకపెట్టి భగమానము సేస్తి, తిరెంగలమ్మ కో
మూరెడు రైక కంటే తనముంగల శింపితి; నేడు ఇంతనే
నేరని కూతలా?" యనుచు నిక్కును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(... విహితము చెప్పుతాను. పెద్ద అమ్మవారికి (గురువులయ్య భార్యకు) చీరపెట్టి బహుమానము చేస్తిని. తిరువెంగళమ్మకు రైకకు (కావలెను) అంటే తనముంగల మూరెడు (కొలిచి) చింపితిని. నేడు వింటూనే నేరని (తెలియని) కూతలా? ...)
69. "ఇంటిగదే పిసాసి మనయేపరి తిమ్మన సూసి ముట్టరా
దం టొకమాట సెప్పె; మడిదోతులు గప్పుత, రేవుకాడ మా
పొంటికి బోసుకుంట; బహుపున్నెమ! టేకాశి దొడ్డ దంట! యె
ప్పంటి కిదేపకార" మని పల్కును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(వింటివిగదే పిశాచి! మనవ్యాపారి తిమ్మన్న చూచి ముట్టరాదని, మడిధవతులు గప్పుకొనుచు, రేవుకాడ మాపు ఒంటికి బోసికొనుచు ఒకమాట చెప్పె; బహు పుణ్యమఁట! ఏకాదశి దొడ్డదఁట! ఎప్పటికి ఇదేప్రకారము ...)
70. "మొన్న పురిట్లొ బోయిన పబుద్దుడు మాగుణవంతు! డాకలం
టెన్నఁడు యేడ్వ; డింత దపి కెన్నడు దెమ్మన; డొర్ల నెవ్వరిం
కన్నెత్తి సూడ! డింతకును గా బది కుండిన్న వాడు పెత్తనా
లెన్నెనొ సేసు" నంచు వచియించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(మొన్న పురిటిలో బోయిన ప్రభుద్ధిడు మహాగుణవంతుఁడు; ఆకలి అని ఎన్నడు ఏడ్వఁడు; ఇంత దప్పికి ఎన్నడు తెమ్మనఁడు; ఒరుల నెవ్వరిని గన్నెత్తి చూడఁడు. ఇంతకునుగా బ్రతికి యుండినచో ఎన్నెన్ని పెత్తనాలో చేయును ...)
71. "బాగుగ పారిజాతములొ పాతలవోమముపట్టు ఇప్పి మొ
న్నాగుడికాడ బైనిడు; ' ఇనాక్కుడు తాటకి ముక్కు--శౌలు మా
యేగిర మంటగోసె ' నని యివ్రముగా తెలసెప్పె! దబ్బరా? -
నా గురుడాన!" అందురు చెనంటులు మూర్ఖులు చంద్రశేఖరా
(బాగుగా పారిజాత (గ్రంథ)ములోని పాతాళహోమపుపట్టు ఆగుడికాడ, బైనీడు మొన్న వివరముగా తెలియఁజెప్పె. అందులో కధాస్వారస్య మే మనఁగా: వినాయకుడు తాటకి ముక్కు చెవులు అంతగోసె నని. దబ్బరా?(అబద్ధమా?) నాగురునియాన(=ఒట్టు))
72. "ఇరియిగ సుస్తి తీరతము లెన్నెన్నొ! యావనగొండగంగజా
తరసరిరావు; పంబలును తప్పెటలున్ కొముగాండ్ల సిండ్ల సం
బర! మదిగాక ఇంకొక పెబావము: రంకులరాట మెక్కి నే
తిరిగిన సాటిరా"దని నుతించును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(విరివిగా చూస్తిని తీర్థము లెన్ని ఎన్నొ ... అదిగాక ఇంకొక ప్రభావము (ఏమనగా) ...)
73. "కలిగిరితీర్తమోయి ఒకకానిక యాపెరుమాల్లకోయిలో
పల బడయేస్తి పట్టు మని పల్లెములో; తొలిశాకు దీసి శే
తులొ బడయేశి పొ మ్మనుచు దొబ్బె నొరే గుడినంబి యంట! యే
కులమొ! ఇదేల యిస్తి" నని గొన్గును ముర్ఖుఁడు చంద్రశేఖరా
(... కోవెల లోపల ...)
74. "సేరున వాడవల్లి నరిశిన్నుడితీరతమోయి బోగమ
మ్మోరులయాట సూస్తి; దనిముంగల దేము డ దెంత! ఇద్దెలో
తీరుపయాస గంటి; ఒకతిత్తి గుగిం తిడ కూదె వానికా
లూరక మొక్కబు ద్దెగు నహో!" యను , మూర్ఖుఁడు చంద్రశేఖరా
( ... విద్యలో ఒకతీరు ప్రయాస గంటి ( అదేదనఁగా); ఒక తిత్తి గ్రుక్క ఇంత విడువక ఊదె- వాని కాళ్ళు ఊరక ...)
75. "కంచికి బోత దం టలశిఖండిది! కంచెడు తీసు కాణ్ణె కొ
ట్టించుక సేస్త దంట పడెడేసి పలాములు! బూదేవోమ్మ మం
టొంచనలేక శెప్పితి; ఇవోకము లేదటె! అమ్మవార్ని శే
యించుక వస్త దంట! అని యెన్నును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(ఆశిఖండిది(తిట్టు) కంచికిపోతుందట! కుంచెడు(బియ్యము) తీసుకొని ఆడనే కొట్టించుక (=దంపించుకొని) పడేడేసి (=1 1/2 సేరుకోల) వ్యర్థము చేస్తుందట! బూడిదలో హోమమని వంచనలేక చెప్పితిని వివేకములేదా? అమ్మవారిని సేవించుకొని వస్తా నంటుంది)
76. "కాసికి బోయి కమ్మనగ కాయిడి తెచ్చినవోరిపాపముల్
పాసట! మొన్న యీమదెను పర్రెసతానుల యెంట బోతి నా
కాసికి; రంగనాకుల పకారముకాడ అ దెంత మూక! లా
దాసరిబాపనాం!" డ్లని యదల్చుని మూర్ఖుఁడు చంద్రశేఖరా
(.....పాయునట! మొన్న ఈమధ్యను పరేశావధానులవెంట ఆకాశికి బోతిని; (అక్కడ) రంగనాయకుల ప్రాకారముకాడ అదెంత ఆదాసరిబాపనవాండ్ల మూకలు(=గుంపులు)!)
77. "నంబి రమాంజు లెంట శిననాడు తమాసగ బోయిసూస్తి, ఆ
కంబముకాడ యెంటికలు కందలు మండెయి; నాటిసుద్ది మా
సంబర మాడిజాతర! గొసంగులు సేసువు లాలకించ నా
కుంబముకాడ పాడి"రని కూయును ముర్ఖుఁడు చంద్రశేఖరా
78. "కూడలి సంబరాన మనకోదలు కోయిలొ మూకుడేసి ఒ
క్తా డెలిగించి దేవుని పకారములో అనుమంతవాగనం
కాడ సుగాన పండితె జగారములోపల బంగబెట్టి రం
టేడ శిగండిమూకొ" అని యెంచును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(కూడలి(=జనముకూడియుండు చోటు) .... కోవెలలో మూకుడు (=మూతగా నుపయోగించు మట్టితట్ట) వేసి ఒకతాడు వెలికించి(దీపము పెట్టి), దేవుని ప్రాకారములోపల భంగపెట్టిరట! ఎక్కడి శిఖండిమూకయో! ...)
79. కంటకురాల, యేంది ఇది! కామచిదీచ్చితురాలు ఒణ్ణె పిం
డోంటలు - పప్పులోన, పయిడొల్ల - ఇదెక్కడి ఇత్తుకట్టొ! ఆ
రెంటికి పాకనానెమొ! ఇరిత్తిమొ మారుసి! తీపిశెట్టుపే
రెంటని తెల్సుకో" యనును ఎడ్డెడు మూర్ఖుఁడు చంద్రశేఖరా
( .... కామాక్షి దీక్షితురాలు ఒండిన పిండివంతలు: పప్పు లోనను, పయున డొల్లయు - ఇదెక్కడి విత్తనపుకట్టో! ... విరిస్తిమా మహారుచి! (ఆ) తియ్యచెట్టు పేరు ఏమిటని తెలుసుకో - అని భార్యకు చెప్పుచున్నాడు ...)
80. "ఇరుసుక తింత తియ్యనగ; ఏమిరుశో అది బోగమోల్లకే
యెరికె! తిరెంగలమ్మ తొలియేకశి కా తిరకోనమందు మా
ఇరియిగ బోసె, దానిశమ యెంతనిసెప్ప! ఒడించె -రంగ! ఆ
కరెమొద లెంచ నాతరముగా" దను మూర్ఖుఁడు చంద్రశేఖరా
(... తొలిఏకాదశికి ఆత్రికోణమునందు మహావిరివిగా బోసినది. దాని శ్రమ ఎంతని చెప్పశ్క్యము! ఒడ్డించె కరియముదులు(కూరలు - వైష్ణవపరిభాష) ఎంచుటకు ...)
81. "గాల్లకు మంద చ చ్చపుడు గజ్జులు వాలుగు మచ్చు కింతపూ
రెల్లదు; నేడు పీతిరిపయోజన మంటవు, కాశిబిట్లు, మా
మల్లని కీరి కట్టె నడుమడ్డది తెల్లనినీల్లులేక; మా
పే ల్లిటు రాని సత్త" డని ప్రేలును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(గాలు(=పశువులకువచ్చు గాలిజబ్బులు)లకు మందచచ్చి ... మచ్చునకు ఇంత పూరి(గడ్డి)వెళ్ళద; కాశీభట్లూ, నేడు పితృప్రయోజన మంటావు. మామల్లడు అనువానికిన్ని, వీర అనుదానికిని అట్టెనడుము పడినది -తెల్లనినీళ్ళు (మజ్జిగనీళ్ళు) లేక; ...)
82. "రోసినతొత్త, యేం దిది! పురోహితు లెట్టినకూర గబ్బు! ఆ
మీసరపోతో, రొయ్యో, కొఱమీనొ, సొరో, వుపుశాపొ, చెచెమల్
గో, సుడిపక్కొ, వాలగొ, నేగో - ఇదితెస్తివి! - బాపనారి ఆ
ప్పాసులు నేతితియ్య" నని పల్కును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(.... ఔరోహితులు పెట్టిన .. గబ్బు(=సువాసన) ఆమీసరపోతొ ...సెగో (చేపలపేర్లు) బాపనవారి అప్పచ్చులు నేతివి తియ్యన ...)
83. "వోరది లిప్పసంగములొ! వుప్పరసంఘమొ! ఇస్తరాకు లీ
బారను యెన్ని యేస్తవు నిబద్దిగ సెప్పు? తలోకి లెంట ఓ
పారి తయారు శేస్తె ఒకపాలవు; యాట పనాళ్ళ కిత్తు; మీ
కోరినయట్ల యిస్త" నని కూయును ముర్ఖుఁడు చంద్రసేఖరా
(ఎవరది? విప్రసంఘములా ఉప్పరసంఘమా? ...నిబద్దిగ(=నిజముగా) తలవాకిలివెంట ఒకపారి (ఒకపర్యాయము) ...యాట(=ప్రతిసంవత్సరమున్నూ)...)
84. వాశిగ పెండ్లిబంతి బవుబత్తిగ సౌదరి బెట్టె సొప్ప క
ట్టేశి కుకుండబెట్టి; అదె నివ్వరివంటక మెట్టి పైన ప
ప్పో శోకయేలు ముంచి పడబోసితి నై; చరిగానె వొక్కడన్
శేశితి వంక రుట్టె" నని చెప్పును ముర్ఖుఁడు చంద్రశేఖరా
( ...చౌదరి .. చొప్పకట్టెవేసి కూకుండబెట్టి నివ్వరి(ధాన్యము) వంతకము పెట్టి పైన పప్పుపోసి ఒక వ్రేలు ముంచి పడబోసితి నెయ్యి .. వంకరపుట్టె...)
85. "పరుగున వచ్చి సూడు ఇది పాడుపిసాసి! అమాసపూట ఇ
స్తరి లొకవోర సించి సిరిసిందిదిగో దిని బొందబెట్ట! ఏ
మెరగవు ఆనపచ్చడిని యెంకటదోసులబార్రె యెట్టెఁ; ఆ
సరి సయిగానె వెంత" దని సాటును ముర్ఖుఁడు చంద్రశేఖరా
( .... విస్తరిలో ఒకయోర చించి ... ఇదిగో దీనిని బొంద(లో)బెట్ట! ఏమిఎఱుగవు. ఆనపపచ్చడిని వెంకటజోశ్యుల భార్య పెట్టె. ఆఁ సరియే చవిగానె ఉంటది ...)
86. "అనువుగ ఇంత సీమ శిటు కంటనె ఒంటక మోసి బూరెలే
వన మనసార బెట్టుగద! పాప మదొక్కటి పాడుబుద్ది! బా
పనిది శినాడిపెండ్లి కొకపైకము దీసుక చాల దంట మా
గొనిగె సిగండిబండ!" అని కూయును ముర్ఖుఁడు చంద్రశేఖరా
(.... బాపనిది(బ్రాహ్మణిది) చిన్నవాని పెండ్లికి ... మహాగొణిగె...)
87. "తలదిపకార మోసుకొయి తాగును ఎక్కడి యంగYఏసుడో
తెలదు! సెనార మంత! నెయితిర్లక లంట! ఉపాసమంత! అ
య్యలకు తలాకు లంట! ఇది యందముగా దని సెప్పి; తిందు మా
కులమునగాని శాత"లని కూయును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(తలదిగబార మోసుకపోయి తాగుతాడు, ఏ ... శనివారమంట! నెయ్యి(తోఁబెట్టిన) తిరువళికె (దీపము)లంట! ... తలియాకు(విస్తరాకు) లంట! .. సెప్పితి; వినదు మాకులమునఁగాని చేతలు ...)
88. "ఎలిపెరుమాళ్ళసంబర మదెన్నడు సూడలె! ఏమి యింత! మం
గలగిరిబోగమోల్లు, పయి కమ్మగ బూరగు లూదెవోల్లు గుం
పులొ తెగగాల్చెవోల్లు, మరి కొబ్బెర-బెల్లము లమ్మె వోల్లు మా
తెలిసినవోల్లకే తెలుసు దేము"డటందురు మూర్ఖులు చంద్రశేఖరా
89. "జోసుడు మొన్న గేబలము సూటిగ సెప్పె; మనింటి దాంది మా
సూసె; బలైనమూత్రమట! సోతెట నచ్చతరం! మరందులో
మేసములో ఇరిద్దట! వుమేసరబొట్లదివంగడం సరే
మాసదినా" రటందురు ప్రమత్తులు మూర్ఖులు చంద్రశేఖరా
(... గ్రహబలము .. మన ఇంటిదాని(భార్య)ది మహాచూచెను. బలమైన ముహూర్తమట! చౌతియట నక్షత్రము! మరి అందులో మేషములో వృద్ధియట! .. మహాచదివినవారు ...)
90. "సామిదరోగ మంత! - మనసత్తి దెగాదిగ సూశి శేతులో
తామర పద్ద ముండదట! దానికి కిందియి మీది యన్నియే
మే మని లెక్కసూసి పిల లింద రటం టని సూపి దాందినా
కే మరిబాగ సెప్పె" నని యెన్నును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(సాముద్రికయోగ మంట! - మనసత్తి(అనునామె)ది (చేయి) చూచి ... తామరపద్మ మున్నదట! దాని (ఆతామర పద్మము యొక్క) క్రిందివి మీదివి అన్నియు ఏమి ఏమి అని లెక్కచూచి పిల్లలు ఇందరు అని దాంది (దానినిగూర్చి) ...)
91. గురియట పేడశారమట! కొయ్యలొ తైదెడుతిర్లకంట! ఇ
ద్దరు తిరుసున్న మెట్టుకొని దారిని బెట్టి ర టొక్కజాము కం
టరమితి పూలు వొణ్ణి కలటంటనె మేలుక సెప్పె బాగ్యె! మా
గురి యిది దప్ప" దంట తెగగూయును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(తప్పక జరుగునట! ప్రాణాచారమట! కోవెలలో తైదెడూ (=ప్రమిదెడు) తిరువళిక(దీపము) అట. ఇద్దరును తిరుచూర్ణము పెట్టుకొని ... కల ఆట అంతనే మేల్కొని బెప్పె భాగ్యము.)
92. తొల్లిసమందరా లహిశితుండు తమా మెగబీల్చె నంట! మా
తెల్లము గింటి బాపుశెపితే;కిటు కొక్కటి; నారసీము డో
పల్లున మోసె బూమిని నిబద్దిగ సెప్పును; బైనిడా, అదే
సల్లని వాకు శెప్పు" మను సారెకు మూర్ఖుఁడు చంద్రశేఖరా
(పూర్వము సముద్రాలు అగస్త్యుడు .. మహాతెల్లముగా (=స్పష్టముగా) వింటిని బాబు చెప్పితే ... నారసింహుడు ఒక పల్లు మీద ...)
93. సద్దటు కాశికాయిడికి సన్నపుదూదెకు నారగట్టి మా
ప్పొద్దున యీనెవాద్దె మని మూల్గుత గొన్గు నదే ముమాదమో!
గిద్దెడు గింజలియ్య తల గింగురు మంతది! వాగ కూర కీ
కొద్దిని బోడ"టందు రలకూళలు మూర్ఖులు చంద్రశేఖరా
(సద్దియట్టు (చద్దివలె) కాశీకావడికి .. మాపుప్రొద్దున వీణెవాద్య మని .. అదేమి ఉన్మాదమ్మో ...)
94. "సంగితకాడ, పాదకిక సాలిచు! నీ వది పాదినందుకున్
ఇంగిత మెంచి నేను మరి యినినందుకున్ సరిపోయె; ఇంటివా?
హంగున నేత లూశినటి యప్పకు తంబుర యీడ మెట్టిపో
బంగుడుబాపనాడ" యనివాగును మూర్ఖుఁడు చంద్రశేఖరా
95. "ఊరినడీదిబా యొడున ఊపిది బూ, సొనమాల లేసి ఇ
ద్దేరితి యంత కూకొని వినేశుకు నీ లెగజల్లి గొన్గి యే
లూరికె తిప్పి, శేసరిసి ఊరికి గాతలు పన్నె; ఈని బై
శారగ గొట్ట" మందురు మూర్ఖులు చంద్రశేఖరా
(ఊరినడివీధిబావియొడ్డున విభూతి బూసి వనమాలలేసి ... ఇనేశుకు నీళ్ళు ఎగజల్లి గొణిగి వ్రేళ్ళు ఊరకత్రిప్పి చేయిచరచి ఊరికి ఐష్టములు తెచ్చె భవిశ్యమార ...)
96. "ఎగమడతారు సీరలకు యీదిమా డూరికె యేమి నాన్నెమో
తొగరటె ఇప్పి సూసుకొని దొబ్బిరి ముచ్చవలాలు మూడు; మా
పొగరెశినాది యీరలకు! బూసన మం టది యేమి శిత్రమో!
తగలెయ దానిదీసి" యని తక్కును మూర్ఖుఁడు చంద్రశేఖరా
(వీధినిబడి ఊరకేచీరలకు ఎగబడతారు ఏమినాణెమో! తొగరు (దారపు అని) అని విప్పిచూసుకొని .. మూడు ముచ్చవలాలు (మూడు చవలాలు -చవలము=వరహాలో 8 వభాగము)
97. "పార్వతితోడఁ గూడి బలుపట్టపురాజులు సన్నుతింపఁగా
శార్వరినాడు లేచి సుమ శోభనపుష్పవనంబులోన నా
సార్వవిభుండు శంభుఁడు సుసాయకహస్తుఁడు నన్ను గాఁచు మీ
పర్వమునందు విష్ణుయుత పార్వతీదేహుఁడ, చంద్రశేఖరా
సమాప్తం